‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావడంపై యావత్ దేశం గర్విస్తోంది. నిన్న ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఈ విజయానందం కనిపించింది. మాజీలు సునీల్ గవాస్కర్, మాథ్యూ హెడెన్, అజిత్ అగర్‌కర్, సంజయ్ భంగర్ మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ఓ స్టెప్పు వేశారు. సునీల్ గవాస్కర్ మాత్రం ‘నాటు నాటు’ అంటూనే పలుమార్లు హుషారుగా స్టెప్పులేశాడు. భారతీయ సినిమాకు ఇదెంతో గర్వకారణం అని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే.
భారతీయ సినిమాకు ఆస్కార్ దక్కడం ఎంతో సంతోషంగా ఉందని గవాస్కర్ అన్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ ఘనత సాధించడంలో ప్రతి ఒక్కరి కృషిని కొనియాడిన గవాస్కర్.. సినిమా తాను చూశానని, ఎంతో అద్భుతంగా ఉందన్నారు.
ఈ పాట ఫీవర్ ఇప్పుడు క్రికెటర్లందరినీ తాకింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోనూ నాటునాటు పాటపై నృత్యాలు చేశారు కొందరు క్రికెటర్లు. ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ ఇద్దరూ కలిసి స్టెప్పులు వేశారు. ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు పాటకు మంచి ఆదరణ లభించింది. ఆస్కార్ వేదికపై భారతీయ సినిమాకు సంబంధించిన లైఫ్ పర్‌ఫార్మెన్స్ చేయటంతో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?