ఆగస్ట్ రెండో వారంలో బడా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్ నటించిన లాల్‌సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో కూడా సరికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి.
లాల్ సింగ్ చడ్డా: ఆగస్ట్ 11
చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న అమీర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’ మూవీ మొత్తానికి ఆగస్ట్ 11న థియేటర్లలో విడుదల కాబోతుంది. నాలుగేళ్ల తర్వాత అమీర్‌ను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. నాగచైతన్య ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్నాడు.
రక్షా బంధన్: ఆగస్ట్ 11
మరోవైపు బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ ఆగస్ట్ 11న ‘రక్షా బంధన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు బడాస్టార్స్ ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటంతో ఆసక్తి ఏర్పాడింది.
మాచర్ల నియోజకవర్గం: ఆగస్ట్ 12
నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ ఆగస్ట్ 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. నితిన్ ఇందులో ఐఏఎస్ పాత్రలో కనిపించనున్నాడు. క్యాథరిన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
కార్తికేయ 2: ఆగస్ట్ 13
నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ చివరికి ఆగస్ట్ 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకృష్ణుడు, ద్వారక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుంది.
ఓటీటీ రిలీజ్లు:
Title | Category | Language | Platform | Release Date |
Happy Birthday | Movie | Telugu | Netflix | August 8 |
The Warriorr | Movie | Telugu, Tamil | Hotstar | August 11 |
Rashtra Kavach Om | Movie | Hindi | Zee5 | August 11 |
Beautiful Billo | Movie | Punjabi | Zee5 | August 11 |
Window Seat | Movie | Kannada | Zee5 | August 11 |
Thank You the Movie | Movie | Telugu | Prime Video | August 12 |
Gargi | Movie | Tam,Tel,Mal | Sony Liv | August 12 |
Cadaver | Movie | Tam,Tel,Mal, Kan | Hotstar | August 12 |
Maha Manishi | Movie | Telugu | Aha Video | August 12 |
Malik | Movie | Telugu | Aha Video | August 12 |
Shrimati | Movie | Bengali | Zee5 | August 12 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!