ఈ వారం దీపావళి (Diwali Festival)ని పురస్కరించుకొని పలు కొత్త చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మీ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు రెడీ అవుతున్నాయి. వెలుగుల పండగ సందర్భంగా ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచేందుకు తాము సిద్ధమంటున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
క
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా సుజిత్ – సుదీప్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘క’ (KA Movie). నయన సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇందులో కిరణ్ అబ్బవరం పోస్టుమ్యాన్ పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలై ‘క’ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
లక్కీ భాస్కర్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar). మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఒక సాధారణ ఉద్యోగి కోటీశ్వరుడిగా ఎలా మారాడు అన్న ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు.
సింగమ్ అగైన్
భారీ అంచనాలతో దీపావళి కానుకగా రాబోతున్న బాలీవుడ్ చిత్రం ‘సింగమ్ అగైన్’ (Singam Again). డీసీపీ బాజీరావు సింగమ్‌గా అజయ్ దేవ్‌గన్ నటించాడు. నవంబర్ 1న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇందులో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణ్‌వీర్‌సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె లాంటి స్టార్‌లు నటించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
అమరన్
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’ (Amaran). ఉగ్రదాడిలో మరణించిన ఆర్మీ ఉద్యోగి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దిగ్గజ నటుడు కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
బఘీర
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో రూపొందిన కన్నడ చిత్రం ‘బఘీర’ (Bagheera). ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. సూరి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 31న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు
తంగలాన్
తమిళ నటుడు చియాన్ విక్రమ్ నటించిన రీసెంట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’ (Thangalan). ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రిలీజైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల జాప్యం తర్వాత ఈ వారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. అక్టోబర్ 31 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.
మా నాన్న సూపర్ హీరో
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ (Ma Nanna Super Hero) మూవీ ఈ వారం స్ట్రీమింగ్‌లోకి రానుంది. అక్టోబర్ 31 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 వేదికగా ప్రసారం కానుంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిచంద్ షాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. ఆర్ణ హీరోయిన్‌గా చేసింది. అక్టోబర్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.
అర్థమైందా అరుణ్‌కుమార్ 2
హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘అర్ధమయ్యిందా..? అరుణ్ కుమార్’. సీజన్ 1కు విశేష స్పందన రావడంతో సీజన్ 2 (Arthamainda Arun Kumar Season 2)ను అక్టోబర్ 31న తీసుకొస్తున్నారు. ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో పవన్ సిద్దు మెయిన్ లీడ్‌గా నటించాడు.
Title | Category | Language | Platform | Release Date |
Time Cut | Movie | English | Netflix | Oct 30 |
Murder Mindfully | Movie | English | Netflix | Oct 31 |
The Diplomat Season 2 | Series | English | Netflix | Oct 31 |
Love Mocktail Season 2 | Series | Telugu | ETV Win | Oct 31 |
Wizards Beyond Waverly Place | Series | English | Hotstar | Oct 30 |
Lubber Pandhu | Movie | Telugu Dub | Hotstar | Oct 31 |
Koshkinda Kandam | Movie | Telugu Dub | Netflix | Nov 1 |
Joker: Folie à Deux | Movie | English | Amazon | Oct 29 |
Anjamai | Movie | Tamil | Aha | Oct 31 |
Somebody Somewhere S3 | Series | Hindi | Amazon | Oct 25 |
Vettaiyan | Movie | Telugu/Tamil | Amazon | Nov 7 |
Mithya: The Dark Chapter | Series | Telugu, Hindi | Zee 5 | Nov 1 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!