ప్రస్తుతం ఓటీటీ యుగంలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. వీకెండ్ వచ్చిదంటే చాలు.. ఈ తరహా చిత్రాలను వీక్షించేందుకు తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు. మంచి థ్రిల్లింగ్ కంటెంట్‌తో వచ్చిన సినిమా కోసం ఓటీటీ వేదికల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అటువంటి వారి కోసం YouSay ఓ మూవీ సజీషన్‌ను తీసుకొచ్చింది. ఈ వీకెండ్‌లో చూసేందుకు బెస్ట్ ఇన్‌వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను పరిచయం చేస్తోంది. మలయాళంలో మంచి విజయం అందుకున్న ఆ చిత్రాన్ని తెలుగులోనూ వీక్షించవచ్చు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది?
స్ట్రీమింగ్ ఎక్కడ?
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లు తీయడంలో మిగతా భారతీయ భాషల దర్శకుల కంటే మలయాళం కథకులు రెండడుగులు ముందే ఉంటారు. ఈ నేపథ్యంలో వచ్చిన మలయాళ చిత్రమే ‘ఇరట్టా’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. రోహిత్ ఎంజీ కృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జోజు జార్జి, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. 2023లో విడుదలైన ఈ చిత్రాన్ని ఈ వీకెండ్ గనుక చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యామా? అన్న ఫీలింగ్ తప్పక కలుగుతుంది.
కథేంటి?
కేరళలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా అటవీశాఖ మంత్రి హాజరవుతాడు. ఇంతలో తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో అక్కడికి అందరూ చేరుకుంటారు. ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) అక్కడ బుల్లెట్లు దిగి చనిపోయి ఉంటాడు. అతన్ని ఎవరు చంపారో తెలియదు. దీంతో పోలీస్ స్టేషన్ మొత్తం లాక్ చేసి ఎవరినీ బయటకు పంపకుండా విచారిస్తూ ఉంటారు. ఇంతలో ఈ విషయం వినోద్ కవల సోదరుడు, డీఎస్పీ అయిన ప్రమోద్‌కు (జోజు జార్జి సెకండ్ రోల్) తెలుస్తుంది. విషయం తెలియగానే ప్రమోద్ కూడా అక్కడికి చేరుకుంటాడు? అసలు వినోద్‌ను ఎవరు చంపారు? ప్రమోద్, వినోద్ గతంలో ఎందుకు గొడవ పడ్డారు? ఈ కథలో మాలిని (అంజలి) ఎవరు? అన్నది కథ.
ఎందుకు చూడాలంటే..!
మలయాళంలో ఇరట్టా అంటే ఇద్దరు అనే అర్థం వస్తుంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ అండ్ సెస్పెన్స్ థ్రిల్లర్‌ను జోడించాడు దర్శకుడు. వినోద్ చనిపోయిన సమయంలో అక్కడ ముగ్గురు పోలీసులు ఉండటం.. వారితో వినోద్‌కు గొడవలు ఉండటం ఇన్‌వెస్టిగేషన్‌పై ఆసక్తిని పెంచుతుంది. వినోద్ చనిపోయే సమయంలో ముగ్గురు పోలీసులు ఏం చేస్తున్నారు? వారికి వినోద్‌తో ఉన్న వైరం ఏంటి? అన్నది ఆసక్తికరంగా చూపిస్తూనే మరిన్ని చిక్కుముడులను తీసుకురావడం ప్రేక్షకులకు థ్లిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇక ప్రమోద్, వినోద్‌ల తండ్రి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్‌గా అనిపిస్తాయి. రియలస్టిక్‌గా జరుగుతున్న భావనను ప్రేక్షకుల్లో కలిగిస్తుంది. ఓవరాల్‌గా ‘ఇరట్టా’ అనేది ఒక సూపర్ థ్రిల్లర్ సినిమా. సెన్సిటివ్‌గా ఉండే వాళ్లు ఈ సినిమాను చూసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది