• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT Suggestions: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. అయితే ఈ వారంతం కంటెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్‌ అని చెప్పవచ్చు. థియేటర్‌లో పలు ఆసక్తికర చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. మరికొన్ని రాబోతున్నాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం. (OTT Suggestions)

    అమరన్‌ (Amaran)

    పాన్‌ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్‌ తమిళ చిత్రం ‘అమరన్‌’ (Amaran OTT Platform). అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ కుమార్‌ పెరియసామి డైరెక్ట్‌ చేశారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ.

    మట్కా (Matka)

    మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘మట్కా’ (Matka) కూడా ఈ వీకెండ్‌ ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్‌ 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో వరుణ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 20 రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? సుజాతతో వాసు లవ్‌ట్రాక్‌ ఏంటి?’ అన్నది స్టోరీ.

    విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video)

    ’యానిమల్‌’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్‌ చిత్రం ఈ వీకెండ్‌లోనే ఓటీటీలోకి రాబోతోంది . ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ  భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్‌ శాండిల్య డైరెక్ట్ చేశారు. అక్టోబర్‌ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్‌ నైట్‌ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.

    జిగ్రా (Jigra)

    బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ మూవీ ‘జిగ్రా’ (Jigra OTT). ఈ చిత్రం కూడా ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. కరుణ్‌ జోహర్‌ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి రిలీజై యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. వాసన్‌ బాల డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్ర పోషించాడు. అలియా చేసిన సత్య పాత్రకు తమ్ముడిగా వేదాంగ్‌ రైనా నటించాడు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ప్లాట్‌ ఏంటంటే ‘సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. ఓ బిజినెస్‌ పనిమీద విదేశాలకు వెళ్లిన అంకుర్‌ అక్కడ డ్రగ్స్‌ తీసుకొని పట్టుబడతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు సత్య ఏం చేసింది? తమ్ముడ్ని ఎలా రక్షించుకుంది?’ అన్నది స్టోరీ.

    మందిర (Mandira)

    సన్నీ లియోనీ (Sunny Leone) ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్‌. యువన్‌ తెరకెక్కించిన సినిమా ‘మందిర’ (Mandira). ఈ మూవీ డిసెంబర్‌ 5 (OTT Suggestions) నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌ వచ్చింది. నవంబర్‌ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇందులో సన్నీ ద్విపాత్రాభియనం చేసింది. ఈ హారర్‌ కామెడీ మూవీలో యోగిబాబు, సతీశ్‌ కీలక పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే ‘గత జన్మలో అనకొండపురం అనే రాజ్యానికి ఓ యువరాణి అయిన మందిర ఇప్పుడు దెయ్యంలా ఎలా మారింది? అసలు ఆమె కథేంటి? అన్నది స్టోరీ.

    కంగువా (Kanguva)

    తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘కంగువా’ (Kanguva OTT Release) ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసుకుంది. వచ్చే వారం డిసెంబర్‌ 13 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. తమిళ డైరెక్టర్ శివ రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ విలన్‌గా చేసింది. హిందీ నటి దిశా పటాని కథానాయికగా చేసింది. థియేటర్లలో మోస్తరు టాక్‌ తెచ్చుకోవడంతో కంగువాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ప్లాట్‌ ఏంటంటే ‘ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ.

    క (Ka)

    ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్‌ బ్లాక్ బాస్టర్‌ చిత్రం ‘క’ (Ka OTT Release) గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌ వేదికగా నవంబర్‌ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. ప్లాట్‌ ఏంటంటే ‘అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు?’ అనేది మిగతా కథ.

    లక్కీ భాస్కర్‌ (Lucky Bhaskar)

    దుల్కర్‌ సల్మాన్ (Dulquar Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Bhaskar OTT Release) సైతం గత వారమే ఓటీటీలోకి వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు?’ అనేది కథ.

    వికటకవి (Vikkatakavi)

    యువ నటుడు నరేష్‌ అగస్త్య (Naresh Agastya) ‘మత్తు వదలరా’, ‘సేనాపతి’, ‘పంచతంత్రం’ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్‌ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో గతవారం తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. ఈ మిస్టరీని కనుగొనేందుకు డిటెక్టివ్ రామకృష్ణ రంగంలోకి దిగుతాడు. దేవతల గుట్టపైకి వెళ్తాడు. అక్కడ ఏం తెలుకున్నాడు? అమరగిరి సంస్థానానికి చెందిన లక్ష్మీ (మేఘా ఆకాష్‌)తో అతడికి పరిచయం ఎలా ఏర్పడింది? ఇంతకీ దేవతల గుట్టకు ఉన్న శాపం ఏంటి?’ అన్నది స్టోరీ. 

    ‘పుష్ప 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    ‘పుష్ప 2’ (Pushpa 2 OTT Release) థియేటర్లను షేక్‌ చేస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రావొచ్చన్న చర్చ మెుదలైంది. వాస్తవానికి ‘పుష్ప 2’ స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. సాధారణగా ఏ సినిమా అయినా 6-8 వారాల గ్యాప్‌తో ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే ‘పుష్ప 2’ను మాత్రం నెల రోజుల్లో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే జనవరి ఫస్ట్‌ వీక్‌లో ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. కానీ, ‘పుష్ప 2’ బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించడం, సంక్రాంతి వరకూ పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో నెల రోజులకు పైగా పుష్పగాడికి తిరుగుండక పోవచ్చు. కాబట్టి సంక్రాంతికి ‘పుష్ప 2’ను ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అది మిస్‌ అయినా పది రోజుల గ్యాప్‌తో వచ్చే రిపబ్లిక్‌ డే (జనవరి 26) రోజునైనా ‘పుష్ప 2’ కచ్చితంగా స్ట్రీమింగ్‌లోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv