• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Peka Medalu Movie Review: ‘పేక మేడలు’.. ఇది గుండెకు హత్తుకునే మిడిల్‌ క్లాస్ ఎమోషన్స్‌!

    నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు.

    దర్శకత్వం: నీలగిరి మామిళ్ల

    సంగీతం: స్మరణ్ సాయి

    సినిమాటోగ్రఫీ: హరిచరణ్ కె.

    ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ

    నిర్మాత: రాకేష్ వర్రే

    నిర్మాణ సంస్థ: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్

    విడుదల తేది: జులై 19, 2024

    హీరోగా వినోద్‌ కిషన్‌ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటించిన చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu Movie Review). క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?

    కథేంటి

    లక్ష్మణ్ (వినోద్ కిషన్), వరలక్ష్మి (అనూష క్రిష్ణ) దంపతులు. మూసీ నది ఒడ్డున ఉన్న బస్తీలో నివసిస్తుంటారు. లక్ష్మణ్‌ ఇంజనీరింగ్‌ చేసినప్పటికీ ఖాళీగా తిరుగుతుంటాడు. రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మి కోట్లు సంపాదించాలని గాల్లో మేడలు కడుతుంటాడు. మరోవైపు భార్య వరలక్ష్మీ కుటుంబ భారం మెుత్తం తానే మోస్తుంటుంది. ఈ క్రమంలో అమెరికా నుంచి రియల్‌ ఎస్టేట్‌ కోసం వచ్చిన శ్వేతా (రితికా శ్రీనివాస్‌)తో లక్ష్మణ్‌కు పరిచయమవుతుంది. శ్వేతను ట్రాప్‌ చేసేందుకు తాను డబ్బున్న వ్యక్తినని లక్ష్మణ్‌ కటింగ్ ఇస్తాడు. భార్య పేరు వాడుకొని బస్తీ మెుత్తం అప్పులు చేస్తాడు. ఆ విషయం తెలిసి వరలక్ష్మీ ఏం చేసింది? లక్ష్మణ్‌కు శ్వేత భర్త ఎలా గుణపాఠం చెప్పాడు? పేక మేడలు లాంటి హీరో కలలు నిజమయ్యాయా? లేదా? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    తమిళ నటుడు వినోద్‌ కిషన్‌ తెలుగులో నేరుగా చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ఇదే. లక్ష్మణ్‌ పాత్రలో అతడు చక్కగా ఒదిగిపోయాడు. గాల్లో మేడలు కడుతూ కాలక్షేపం చేసే భర్త పాత్రలో అద్భుతన నటన కనబరిచాడు. మరోవైపు కుటుంబ భారం మోసే మిడిల్‌ క్లాస్‌ వైఫ్‌ పాత్రలో అనూష క్రిష్ణ ఒదిగిపోయింది. వరలక్ష్మీ పాత్రలో ఆమె నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఎన్నారై లేడీగా రితికా శ్రీనివాస్ కూడా మంచి నటన కనబరిచింది. సినిమా మెుత్తం ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. ఇతర క్యారెక్టర్లలో యాక్ట్ చేసిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు మెప్పించారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    హైదరాబాద్‌ బస్తీలో ఉండే నిరుపేదల జీవితాలను ఈ చిత్రం ద్వారా దర్శకుడు నీలగిరి మామిళ్ల కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. పేక మేడలు ఎలా కుదురుగా ఉండవో దాన్ని నమ్ముకున్న వాళ్ల జీవితాలు కూడా అలాగే ఉంటుందనే సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చారు. బస్తీల్లో ఉండే పరిస్థితులు అక్కడి పిల్లలను ఎలా తప్పుదోవ పట్టిస్తాయో చూపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూనే దానికి ఫన్‌ టచ్‌ ఇచ్చారు డైరెక్టర్‌. అంతేకాదు మహిళ సాధికారతను సైతం చూపించే ప్రయత్నం చేశారు. జీవితంలో కష్టపడందే ఏది సాధ్యం కాదన్న సందేశాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు ఇచ్చాడు. ఫస్టాఫ్‌ మెుత్తం చాలా సాఫీగా సాగిపోతుంది. సెకండాఫ్‌ మాత్రం కొంచెం సాగదీసిన ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్‌ నుంచి ఎండ్‌ టైటిల్‌ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. కమర్షియల్‌ హంగులు లేకపోవడం, రొటిన్‌ స్టోరీ, కొన్ని సన్నివేశాలు గతంలోనే చూసిన భావనను కలిగించడం వంటివి మూవీకి మైనస్‌గా మారాయి.

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయాలకు వస్తే సంగీతం బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమానే అయినా చాలా రిచ్‌గా నిర్మించారు. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • ప్రధాన తారగణం నటన
    • కథనం, స్క్రీన్‌ప్లే
    • సందేశం

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటిన్‌ స్టోరీ
    • కమర్షియల్‌ హంగులు లేకపోవడం
    Telugu.yousay.tv Rating : 3/5  
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv