అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేయడంలో పెదవులు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే కొందరు మహిళలు తమ పెదవులకు ఎలాంటి ప్రమాణాలు పాటించని లిప్‌స్టిక్స్ రాస్తుంటారు. ఇలా చేయడం వల్ల లిప్‌స్టిక్స్‌లోని రసాయనాలు పెదాలకు ఉన్న సహజసిద్ధమైన అందాన్ని దెబ్బతీసి నల్లగా మార్చేస్తాయి. అయితే మరికొందరు పోషకాహార లోపం, అనారోగ్య కారణాల వల్ల తమ పెదవుల అందాన్ని కోల్పోతుంటారు. అటువంటి వారి కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. నల్లగా మారిన పెదవులను గులాబీ రంగులోకి మార్చే అద్భుతమైన చిట్కాలను మీ ముందు ఉంచింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తేనె – నిమ్మకాయ
పెదవుల నలుపును పోగొట్టడంలో తేనె, నిమ్మకాయలు ముఖ్యభూమిక పోషిస్తాయి. ఇవి పెదాలకు మెరుపు వచ్చేలా చేస్తాయి. వీటిని రాసుకోవడం ద్వారా పెదవులు క్రమంగా గులాబీ రంగులోకి మారతాయి. తేనె, నిమ్మరసం మిశ్రమాన్ని వారానికి మూడుసార్లు పెదవులపై అప్లై చేస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు.
కలబంద – తేనె ప్యాక్
పెదాలను ఎల్లప్పుడూ అందంగా, మృదువుగా ఉంచేందుకు కలబంద, తేనెతో చేసిన లిప్ ప్యాక్ ఉపయోగపడుతుంది. కలబంద జెల్‌కు తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. వారానికి ఒకసారి ఇలా చేయడం ద్వారా ఊహించని ఫలితాలను పొందవచ్చు.
గులాబీ రేకులు
గులాబీ రేకులు కూడా మీ పెదవులను అందంగా మార్చేస్తాయి. ముందుగా గులాబీ రేకులను తీసుకొని వాటిని బాగా గ్రైండ్ చేయాలి. అందులో నిమ్మరసం, రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఆ పేస్ట్‌ను ప్రతీ రోజు నిద్రపోయే ముందు పెదవులపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవుల నలుపు తగ్గుతుంది.
పాలు-పసుపు ప్యాక్
పాలు, పసుపు మిశ్రమం పెదవులు పాలిపోకుండా చేస్తాయి. సహజ సిద్దమైన గులాబీ రంగును అందిస్తాయి. ముందుగా ఒక టీ స్పూన్ పాలు, అర టీ స్పూన్ పసుపు తీసుకొని మిశ్రమంలా కలపాలి. దానిని పెదాలకు రాసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి.పేస్ట్ ఆరిన తర్వాత సున్నితంగా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. అలా చేస్తే మీ పెదవులు ఎప్పుడూ తాజాగా కనిపిస్తాయి.
బీట్ రూట్ రసం
బీట్ రూట్ రసంతో పెదవులకు మసాజ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. బీట్ రూట్ ముక్కలతోనూ పెదవులకు మసాజ్ చేసుకోవచ్చు. ఇది ఎంతో తేలిక కూడా. దీని వల్ల మీ లిప్స్ చాలా మృదువుగా, అందంగా తయారవుతాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
తేనె – చక్కెర ప్యాక్
చక్కెరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తేనె.. పెదవులను ప్రకాశవంతంగా మారుస్తాయి. ఈ రెండింటి మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేస్తే కాంతి హీనంగా మారిన పెదాలు రోజుల వ్యవధిలోనే ఎంతో అందంగా పింక్ కలర్‌లోకి మారతాయి. ఇందుకోసం టేబుల్ స్పూన్ తేనెతో ఒక స్పూన్ షుగర్‌ను బాగా కలపాలి. దానిని పెదాల మీద స్క్రబ్ చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలను రాబట్టవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.