• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Popular Bikes in India 2023: దేశంలోని టాప్‌ రేటెడ్‌ బైక్స్‌.. రైడర్స్‌ను ఫిదా చేసే ఫీచర్లు వీటి సొంతం..!

    దేశంలోని యువత అమితంగా ఇష్టపడే వాటిలో ద్విచక్ర వాహనాలు ముందు వరుసలో ఉంటాయి. ప్రస్తుత కాలంలో బైక్‌ అనేది ప్రతీ ఒక్కరికి తప్పనిసరిగా మారిపోయింది. బైక్‌ లేనిదే పని జరగడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న బైక్‌ తయారీ సంస్థలు ఏటా పదుల సంఖ్యలో కొత్త మోడల్స్‌ను లాంఛ్‌ చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటివరకూ వందలాది బైక్స్‌ మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే మంచి ఆదరణను పొందగలిగాయి. టాప్‌ రేటింగ్‌తో దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ బైక్స్‌ ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటీ? ఇప్పుడు చూద్దాం. 

    1. Yamaha MT 15 V2

    యమహా ఎంటీ 15 వి 2 (Yamaha MT 15 V2) బైక్‌ అత్యధిక రేటింగ్‌తో టాప్‌లో నిలిచింది. 155 CC ఇంజిన్‌ కలిగిన ఈ  బైక్‌, 56.87 kMPL మైలేజ్‌ ఇస్తోంది. దీని ఫ్యూయల్‌ కెపాసిటీ 10 లీటర్లుగా ఉంది. ట్యూబ్‌లెస్‌ టైర్స్‌తో దీన్ని తీసుకొచ్చారు. మార్కెట్‌లో ఈ బైక్‌ రూ.1.65 – 1.69 లక్షల మధ్య పలుకుతోంది. 

    2. Hero Splendor Plus

    హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్‌ ప్లస్‌ (Splendor Plus) మధ్య తరగతి బైక్‌ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్‌ ధరలో బైక్‌ను కోరుకునే వారు ఎక్కువగా దీనిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే అత్యంత ఆదరణ పొందిన బైకుల జాబితాలో Hero Splendor Plus రెండో స్థానంలో ఉంది. 97CC ఇంజిన్‌ కలిగిన ఈ బైక్ 70-83.2 Kmpl మైలేజ్‌ను అందిస్తుంది. మార్కెట్‌ దీనిని రూ. 74,541 – 76,346 మధ్య విక్రయిస్తున్నారు. 

    3. Royal Enfield Classic 350

    రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. అందులోనూ Royal Enfield Classic 350 మోడల్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తారు. 350 CC ఇంజిన్‌ కలిగిన ఈ రాయల్‌ బైక్‌.. లీటర్‌కు 41.55 Km మైలేజ్‌ను ఇస్తుంది. దీని ట్యాంక్‌ కేపాసిటీ 13 లీటర్లు. 195 కేజీల బరువు ఉంటుంది. మార్కెట్‌లో దీనిని రూ. 1.90 – 2.21 లక్షల మధ్య విక్రయిస్తున్నారు. 

    4. Yamaha R15S

    టాప్‌ రేటెడ్‌ బైకుల జాబితాలో యమహ ఆర్‌15S నాల్గో స్థానంలో ఉంది. 155 CC ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌, 40 Kmpl మైలేజ్‌ ఇస్తుంది. దీని ఫ్యూయల్‌ కెపాసిటీ 11 లీటర్లు. ఇది 18.6 PS @ 10000 rpm మాక్స్‌ పవర్‌, 14.1 Nm @ 8500 టార్క్‌ పవర్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌ షోరూం ధర. 1.64 లక్షలుగా ఉంది. స్పోర్ట్స్‌ లుక్‌ బైక్‌ కావాలని కోరుకునే వారు ఈ బైక్‌ను పరిశీలించవచ్చు. 

    5. TVS Raider

    ‘టీవీఎస్‌ రైడర్‌’ను ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు ఇష్టపడుతున్నారు. దీనిని కూడా మధ్య తరగతి బైక్ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో మైలేజ్‌ ఇచ్చే బైక్‌ కోరుకునే వారికి ఇది చక్కని ఎంపిక. మార్కెట్‌లో దీని ధర  రూ. 91,104 – 1.04 లక్షలుగా ఉంది. 124 CC ఇంజిన్‌ కలిగి ఉన్న ఈ బైక్‌ లీటర్‌కు 67 Km మైలేజ్‌ను అందిస్తుంది. 

    6. Bajaj Pulsar NS200

    బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌200 బైక్‌కు కూడా మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఈ బైక్‌ షోరూం ధర రూ. 1.49 లక్షలుగా ఉంది. 200CC ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్‌.. 40.36 Kmpl మైలేజ్‌ ఇస్తోంది. దీని మాక్స్‌ పవర్‌ 24.5 PS @ 9750 rpm, టార్క్‌ పవర్‌ 18.74 Nm @ 8000 గా ఉంది. ఇది 158 కేజీల బరువు ఉంటుంది. 

    7. Kawasaki Ninja ZX-10R

    యువత అధికంగా ఇష్టపడుతున్న స్పోర్ట్స్‌ బైక్‌లలో ‘కవాస్కీ నింజా జెడ్ఎక్స్‌-10ఆర్‌’ (Kawasaki Ninja ZX-10R) ముందు వరుసలో ఉంది. సుమారు 998 CC ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ కేవలం 12 Kmpl మైలేజ్‌ను ఇస్తుంది. దీని ట్యాంక్‌ కెపాసిటీ 17 లీటర్లు కాగా, బరువు దాదాపు 207 కేజీల వరకూ ఉంటుంది. మార్కెట్‌లో ఈ బైక్‌ ధర రూ.15.99 – 16.31 లక్షల మధ్య ఉంది.  

    8. KTM 390 Duke

    కేటీఎం 390 డ్యూక్‌ బైక్‌ను కూడా యువత అమితంగా ఇష్టపడుతోంది. ఈ బైక్‌పై రైడ్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. మార్కెట్‌లో ఈ బైక్‌ విలువ రూ. 2.97 లక్షలుగా ఉంది. 373 CC కలిగిన ఈ బైక్‌ ఇంజిన్‌ 29 Kmpl మైలేజ్‌ను ఇస్తుంది. 

    9. Harley Davidson X440

    హార్లీ డేవిడ్‌సన్‌ ఎక్స్‌440 బైక్ కూడా భారత్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఈ బైక్‌ను షోరూంలో రూ. 2.29 – 2.69 లక్షల మధ్య విక్రయిస్తున్నారు. 440 CC ఇంజిన్‌తో ఉన్న ఈ బైక్‌ 35 Kmpl మైలేజ్‌ ఇస్తోంది. దీని బరువు 190.5 కేజీలు కాగా, ఫ్యూయల్‌ ట్యాంక్ కెపాసిటీ 13.5 లీటర్లుగా ఉంది. 

    10. Hero HF Deluxe

    హీరో కంపెనీకి చెందిన HF Deluxe బైక్‌ కూడా వినియోగదారుల నుంచి మంచి రేటింగ్‌ సొంతం చేసుకుంది. ఈ బండిని షోరూమ్‌లో ధర.53,900 – 69,598 మధ్య విక్రయిస్తున్నారు. 100CC ఉన్న ఈ బైక్‌ ఇంజిన్‌.. 70 Kmpl మైలేజ్‌ ఇస్తోంది. దీని ఫ్యూయల్‌ కెపాసిటీ 9.6 లీటర్లుగా ఉంది. తక్కవ ధరలో మైలేజ్‌ బండి కావాలనుకునేవారికి ఈ బైక్‌ కూడా చక్కటి ఆప్షన్‌.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv