ఒకప్పుడు డబ్బు సంపాదన అంటే కేవలం ఉద్యోగం, వ్యాపారం, కుల వృత్తులు మాత్రమే గుర్తుకు వచ్చేవి. ప్రస్తుతం టెక్నాలజీతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా నేటి యువతకు యూట్యూబ్ ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. కోట్లల్లో సంపాదించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. భిన్నంగా ఆలోచించే క్రియేటివిటీ, అందరినీ ఆకట్టుకునే నైపుణ్యం మీకుంటే యూట్యూబ్ ద్వారా ఊహించని ఆదాయం పొందవచ్చు. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్-10 పాపులర్ యూట్యూబర్స్, వారి ఛానెల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. క్యారీ మినాటీ (Carry Minati)
దేశంలోనే టాప్ యూట్యూబ్ ఛానెల్‌గా క్యారీ మినాటీ (Carry Minati) గుర్తింపు సంపాదించింది. ఈ ఛానెల్‌ను హరియాణాకు చెందిన అజయ్ నగర్.. 2014 అక్టోబర్‌లో పెట్టాడు. రోస్టింగ్, గేమింగ్, కామెడీ స్కిట్స్, మ్యూజిక్ రివ్యూ, ఆన్‌లైన్ కంటెంట్ పోస్టు చేస్తూ మంచి ఆదరణ పొందాడు. ప్రస్తుతం క్యారీ మినాటీ ఛానెల్‌ను 3.85 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ ఛానెల్‌కు 3.2 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. క్యారీ మినాటీ ఛానెల్ నిఖర విలువ రూ. 41 కోట్లుగా ఉంది.
2. టోటల్ గేమింగ్ (Total Gaming)
దేశంలోనే టాప్-2 పాపులర్ యూట్యూబర్‌గా అజయ్ (అజ్జు భాయ్) ఉన్నాడు. అతడు పెట్టిన టోటల్ గేమింగ్ (Total Gaming) 3.49 కోట్ల సబ్‌స్కైబర్స్‌తో దూసుకెళ్తోంది. 2018 అక్టోబర్‌లో అజయ్ ఈ యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. Free Fire, PUBG, Call of Duty Mobile గేమ్స్‌ను లైవ్ స్ట్రీమింగ్‌లో ఆడుతూ పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం అజయ్ ఛానెల్‌కు 5.4 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. నికర విలువ రూ. 47.18 కోట్లుగా ఉంది.
3. టెక్నో గేమర్ (Techno Gamerz)
దేశంలోని పాపులర్ యూట్యూబర్స్‌లో ఉజ్వల్ ఛవ్రాసియా (Ujjwal Chawrasia) ఒకరు. టెక్నో గేమర్ (Techno Gamerz) యూట్యూబ్ ఛానెల్ ద్వారా అతడు ఎంతో ఫేమస్ అయ్యాడు. వీడియో గేమ్స్‌ను అమితంగా ఇష్టపడే వారు అతడి ఛానెల్‌ను కచ్చితంగా ఫాలో అవుతారు. ముఖ్యంగా లైవ్ స్ట్రీమ్‌లో ఆడే మైన్‌క్రాఫ్ట్, GTA గేమ్స్ అతడ్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ప్రస్తుతం Techno Gamerz ఛానెల్‌ను 3.34 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ ఛానెల్‌కు 9.4 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. దీని నికర విలువ రూ.15 కోట్లుగా ఉంది.
4. Mr. ఇండియన్ హ్యాకర్ (Mr. Indian Hacker)
దేశంలోని నాలుగో పాపులర్ యూట్యూబ్ ఛానెల్‌గా Mr. ఇండియన్ హ్యాకర్ (Mr. Indian Hacker) ఉంది. దీన్ని దిల్‌రాజ్ సింగ్ 2012 జూన్‌లో ఏర్పాటు చేశాడు. తన హ్యాకింగ్ వీడియోలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం దిల్‌రాజ్ సింగ్ ఛానల్‌కు 3.11 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 5.6 బిలియన్ వ్యూస్ ఛానెల్‌కు ఉన్నాయి. Mr. Indian Hacker నికర విలువ రూ. 16 కోట్లుగా ఉంది.
5. రౌండ్ 2 హెల్ (Round2hell)
జయన్, వసీం, నజీం అనే ముగ్గురు స్నేహితులు రౌండ్ 2 హెల్ (Round2hell) యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టారు. 2016 నుంచి ఫన్నీ వీడియోల ద్వారా నెటిజన్లకు దగ్గరయ్యారు. గతంలో హిందూ దేవత రాధాను కించపరుస్తూ వసీం చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం Round2hell ఛానెల్‌ను 3.1 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఈ ఛానెల్ నిఖర విలువ రూ. 2.39 కోట్లుగా ఉంది.
6. ఆశిష్ చంచలని వైన్స్ (Ashish Chanchlani Vines)
ఆశిష్ చంచలని దేశంలోని ఆరో అతిపెద్ద యూట్యూబర్‌గా గుర్తింపు సంపాదించాడు. అతడు ఆశిష్ చంచలని వైన్స్ (Ashish Chanchlani Vines) ద్వారా ఫన్నీ వీడియోలు చేస్తూ చాలా ఫేమస్ అయ్యాడు. ప్రాంక్ వీడియోలు, చిట్కాలు, మ్యూజిక్, వ్లాగ్స్ చేస్తూ అత్యధిక మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ ఛానెల్‌ను 2.96 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఛానెల్ నిఖర విలువ రూ.41 కోట్లుగా ఉంది.
7. సందీప్ మహేశ్వరి (Sandeep Maheshwari)
సందీప్ మహేశ్వరి చాలా ప్రజాదరణ పొందిన మోటివేషనల్ స్పీకర్. ఇతను 1980 సెప్టెంబరు 28న న్యూఢిల్లీలో జన్మించారు. తన యూట్యూబ్ ఛానెల్‌కు తన పేరునే (Sandeep Maheshwari) పెట్టుకున్నాడు. 2012లో సందీప్ ఈ ఛానెల్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం దీనిని 2.76 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. 2.3 బిలియన్ వ్యూస్ ఛానెల్‌కు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఛానెల్ నికర విలువ రూ.22 కోట్లుగా ఉంది.
8. బీబీ కి వైన్స్ (BB Ki Vines )
దేశంలో ఎనిమిదో అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్‌గా బీబీ కి వైన్స్ (BB Ki Vines) గుర్తింపు సంపాదించింది. 2015 జూన్‌లో భువన్ బామ్ ఈ ఛానెల్ ప్రారంభించారు. పాలిటిక్స్, రిలీజియన్, సామాజిక అంశాలపై ఫన్నీ వీడియోలు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం ఈ ఛానెల్‌ను 2.61 కోట్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. దీని నికర విలువ రూ.122 కోట్లుగా ఉంది.
9. అమిత్ భడన (Amit Bhadana)
అమిత్ భడన అనే వ్యక్తి తన పేరిట ఈ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. పలు రకాలు కామెడీ వీడియోలతో గుర్తింపు సంపాదించాడు. రోస్ట్, స్కిట్స్, రియాక్షన్ వీడియోలతో అందరి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం Amit Bhadana ఛానెల్‌కు 2.44 కోట్ల మంది అనుసరిస్తున్నారు. దీని నికర విలువ రూ.55 కోట్లుగా ఉంది.
10. టెక్నికల్ గురూజీ (Technical Guruji)
గౌరవ్ చౌదరి ‘టెక్నికల్ గురూజీ’ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఛానెల్‌ను 2.29 కోట్ల మంది అనుసరిస్తున్నారు. గౌరవ్ తన ఛానెల్ ద్వారా గేమ్స్, ఈ-కామర్స్, స్మార్ట్‌ఫోన్స్, లాప్‌టాప్స్‌కు సంబంధించిన కంటెంట్ పోస్టు చేస్తారు. ఈ ఛానెల్ నికర విలువ రూ.422 కోట్లుగా ఉంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!