• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరంజీవి త‌మ్ముడిగా పుట్ట‌డం నా అదృష్టం: ప‌వ‌ర్‌స్టార్‌

    నేడు మెగాస్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న‌ సోద‌రుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. సుధీర్ఘ లేఖ‌తో అన్న‌య్య‌పై ఉన్న అభిమానాన్ని మొత్తం రాసుకొచ్చాడు. చిరంజీవికి త‌మ్ముడిగా పుట్ట‌డం నా అదృష్టం. ఆయ‌న‌ను అన్న‌య్యా అని పిలిచిన ప్ర‌తీసారి నాకు తెలియ‌ని అనుభూతి క‌లుగుతుంది. ఆయ‌నచెమ‌టోడ్చి సంపాదించిన డ‌బ్బు నుంచి ఎంతోమందికి సాయం చేశాడు. బ్ల‌డ్‌బ్యాంక్, ఐబ్యాంక్, ఇప్పుడు నిర్మించ‌బోయే ఆసుప‌త్రి, కోవిడ్ స‌మ‌యంలో సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డం ఇలాంటి కార్య‌క్ర‌మాల‌న్ని ఆయ‌న మాన‌వ‌త్నాన్ని చాటుతాయి. చిన్నా, పెద్దా, కులం, మ‌తం వంటి ఎలాంటి తార‌త‌మ్యాలు లేకుండా అంద‌రికీ చేతులెత్తి న‌మ‌స్క‌రించే సంస్కారం మా అన్న‌య్య‌ది. ఆయ‌న నిండునూరేళ్లు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చాడు. ట్వీట్‌ను చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv