ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఏడాదే సినిమా రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులను కొంత నిరాశపర్చేలా 2023, జనవరి 12న సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇతిహాసం ఆధారంగా..
రామాయణంలోని పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఇతిహాస గాథే ఈ చిత్రం. ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం, తమిళ భాషలల్లో రిలీజ్‌కానుంది. బడాస్టార్లు నటిస్తుండటంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, లక్ష్మణుడి, రావణుడి పాత్రల్లో సన్నీ సింగ్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. అంతేకాకుండా హేమామాలిని, వత్సల్ సేత్ మరికొన్ని ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు. ఈ సినిమాకి భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రశాంత్ సుతార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
అభిమానులకు కొంత నిరాశ
ఆదిపురుష్ సినిమాను ఆగస్టు 18, 2020న అనౌన్స్ చేయగా.. 2021, ఫిబ్రవరి 2న చిత్రీకరణ ప్రారంభమైంది. అప్పటి నుంచి వేగంగా చిత్రీకరణను పూర్తి చేయాలని మూవీ మేకర్స్ భావించి 2022, ఆగస్టు 11న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆగస్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తూ రిలీజ్ డేట్‌ను చేంజ్ చేశారు.
వరుసగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీలు
ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీలు షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకులను అలరించనుండగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా కూడా రిలీజ్‌కానుంది. ఈ మూడు చిత్రాలను దాదాపు కంప్లీట్ చేసుకున్న డార్లింగ్.. త్వరలో స్పిరిట్, ప్రాజెక్టు కె సినిమాల్లో నటించనున్నాడట. వీటితో పాటు దిల్ రాజ్, డీవీవీ దానయ్య, మారుతి కాంబోలో రాజా డీలక్స్ అనే హర్రర్ కామెడీ చిత్రానికి కూడ ఈ పాన్ ఇండియా స్టార్ ఓకే చెప్పినట్లు సమాచారం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!