ప్రగ్యా జైస్వాల్. ఈ ఉత్తరాది భామ తన అందం అభినయంతో తెలుగు నాట విపరీతమైన ప్రేక్షకాదరణను పొందింది. కంచె సినిమాలో ఈ బ్యూటీ చూపెట్టిన అభినయానికి ప్రేక్షకులు మాత్రమే కాదు. అందరూ ఇంప్రెస్ అయ్యారు. అందుకే ఈ సినిమా ఈ బ్యూటీకి ఆరు అవార్డులను తెచ్చి పెట్టింది.
కంచెతో మారిన జాతకం..
క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా తర్వాత ఈ బ్యూటీ పెద్ద హీరోల సరసన సినిమాలు చేసే అవకాశం కొట్టేస్తుంది. కంచె సినిమాలో ఈ చిన్నది ప్రదర్శించిన అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.
ఉత్తరాది భామే..
ప్రగ్యా జైస్వాల్ కూడా ఉత్తరాదికి చెందిన బ్యూటీయే కావడం గమనార్హం. తను ముందుగా తమిళ్ సినిమా చేసినప్పటికీ తర్వాత తెలుగులోనే ఎక్కువ సినమాలు చేసింది. ఈ భామ 2014లోనే హిందీలో మెరిసింది. ఐనప్పటికీ తెలుగు సినిమాలనే ఎక్కువగా చేస్తూ టాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది.
ప్రత్యేక పాత్రలు కూడా..
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గానే కాకుండా ప్రత్యేక పాత్రల్లో కూడా అప్పుడప్పుడు మెరుస్తుంది. దర్శకేంద్రుడు కింగ్ నాగార్జునతో కలిసి తెరకెక్కించిన ఓం నమో: వెంకటేశాయ సినిమాలో ఈ చిన్నది ఒక్కసారి తళుక్కున మెరిసి మాయమవుతుంది.
ఒక్కసారిగా డోసు పెంచిన బ్యూటీ…
చాలా రోజుల వరకు కామ్‌గా ఉన్న ఈ బ్యూటీ బోయపాటి శ్రీను తీసిన జయ జానకి నాయక సినిమాలో, కృష్ణవంశి తెరకెక్కించిన నక్షత్రం సినిమాల్లో అందాలను ఆరబోస్తూ ఒక్కసారిగా డోసు పెంచేసింది.
బాలయ్యకు జోడీగా..
నందమూరి నటసింహం బాలకృష్ణతో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ సినిమాలో ఈ బ్యూటీనే హీరోయిన్. బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే గ్యారంటీ హిట్ అని ప్రేక్షకుల్లో ఒక ఒపీనియన్ ఉంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన లెజెండ్, సింహా మూవీలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి తెరకెక్కిస్తున్న అఖండ మూవీ డిసెంబర్ 2న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ మూవీ ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో..