అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం యావత్ దేశాన్ని షేక్ చేస్తోంది. థియేటర్లలో మాస్ జాతరను సృష్టించింది. దేశవ్యాప్తంగా ఉన్న చాలా వరకూ థియేటర్లలో పుష్పగాడి రూలే నడుస్తోంది. హీరో అల్లు అర్జున్ మరోమారు అవార్డు విన్నింగ్ నటనతో ఆకట్టుకున్నాడని ఆడియన్స్ అంటున్నారు. అటు సుకుమార్ సైతం తన మార్క్ మేకింగ్‌తో మెస్మరైజ్ చేశాడని పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఓ విషయంలో మాత్రం సుకుమార్ తమను మోసం చేశాడని ఆడియన్స్ ఫీలవుతున్నారు. అందుకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ గ్లింప్స్ సీన్స్ మిస్సింగ్..
‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ సుకుమార్ మెుట్ట మెుదటగా ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ ఒక గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. అందులో పుష్ప మిస్సింగ్ అంటూ ప్రజలు అల్లర్లకు దిగుతారు. స్మగ్లింగ్ చేసిన డబ్బుతో పుష్ప చేసిన మేలును చెప్పే ప్రయత్నం చేస్తారు. అటు మీడియా ఛానల్స్ సైతం పుష్ప ఎక్కడ? అంటూ వార్తలు ప్రసారం చేస్తాయి. ఈ క్రమంలో అడవిలో జంతువుల కోసం పెట్టిన కెమెరాలో పుష్ప కనిపిస్తాడు. ఈ గ్లింప్స్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘పుష్ప 2’పై భారీగా అంచనా పెరగడానికి కారణమైంది. అయితే తాజాగా విడుదలైన ‘పుష్ప 2’ చిత్రంలో గ్లింప్స్‌లోని ఒక్క సీన్ కూడా కనిపించలేదు. దీంతో సుకుమార్ తమను దారుణంగా మోసం చేశారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 2023 ఏడాదికి గాను బిగ్గెస్ట్ ప్రాంక్ వీడియో అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
నెక్ట్స్ పార్ట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయవచ్చా?
‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ వచ్చిన గ్లింప్స్‌లోని సన్నివేశాలు ‘పుష్ప 3’లో కనిపించే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి. ‘పుష్ప 2’ క్లైమాక్స్ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే క్లైమాక్స్‌లో ఓ భారీ బాంబ్ బ్లాస్ట్‌ను చూపించారు. అది కూడా పుష్ప అటెండ్ అయిన పెళ్లిలో జరుగుతుంది. పుష్పను టార్గెట్ చేసి శత్రువులు ఈ బ్లాస్ట్ చేయిస్తారు. ఈ ఘటన తర్వాత పుష్ప కనిపించకుండా పోయే ఛాన్స్ ఉందని నెటిజన్లు అంచనా వేస్తారు. అతడు బతికున్నాడో లేదో తెలియక ప్రజలు అయోమయానికి గురై ఇలా అల్లర్లకు పాల్పడి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. పార్ట్ 2 క్లైమాక్స్‌లో పుష్పకి కొత్త శత్రువులు యాడ్ అవ్వడం, ఇంటర్నేషనల్ స్థాయిలో స్మగ్లింగ్‌కు తెరలేపడంతో ‘పుష్ప 3’ (Pushpa 3) మరింత ఆసక్తికరంగా ఉండొచ్చని తెలుస్తోంది.
పుష్ప 3 ఎప్పుడంటే?
‘పుష్ప 2’ భారీ విజయం సాధించడంతో ప్రస్తుతం అందరి దృష్టి మూడో భాగంపై పడింది. ఈ మూవీ (Pushpa 3 Release Date) ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ సినిమా మెుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకుంటే పుష్ప 2 తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అటు సుకుమార్ సైతం రామ్ చరణ్‌తో ‘RC 17’ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నాడు. ఐదేళ్ల కాలాన్ని పుష్పకు అంకితం చేయడంతో సుకుమార్ కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ‘RC 17’పై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. అటు బన్నీ, ఇటు సుకుమార్ తమ ప్రాజెక్ట్‌లను ఫినిష్ చేసుకున్న తర్వాతే ‘పుష్ప 3’ని పట్టాలెక్కించనున్నారు. దీనికి కనీసం నాలుగేళ్ల సమయం పట్టవచ్చని ఫిల్మ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2028లో ఈ సినిమా (Pushpa 3) పట్టాలెక్కవచ్చని అంచనా వేస్తున్నాయి.
బన్నీపై NHRCకి ఫిర్యాదు!
మరోవైపు ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన మానవ హక్కుల కమిషన్ (NHRC) వద్దకు చేరింది. ఈ విషయంపై ఓ న్యాయవాది NHRCకి ఫిర్యాదు చేశారు. పోలీసు యాక్ట్ కింద ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలియజేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు. ఘటనకు కారకులైన నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో రాసుకొచ్చారు. కాగా, ఈ ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమీషన్ స్వీకరించింది. త్వరలోనే నోటీసులు పంపే ఛాన్స్ ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!