మీరు కొత్త సంవత్సరంలో ఏవైనా రొజుల్యూషన్స్ పెట్టుకున్నారా? నేను పెట్టుకున్నాను అని చెప్తోంది రాశిఖన్నా. మీరు అనుకున్నవన్నీ పాటిస్తారో లేదో తెలియదు కానీ..నేను పెట్టుకున్న రిజొల్యూషన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతానని చెప్తోంది. మరి ఇంతకీ ఈ బ్యూటీ 2022 లో తీసుకుంటున్న నిర్ణయాలేంటి.. ఏం చేయాలనుకుంటుంది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అవేంటంటే..
1. లైఫ్‌లో ఏది జరిగినా అంతా మన మంచికే జరిగింది అనుకోవాలి అని ఫిక్స్ అయిందీ బ్యూటీ. జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని అనుకుంటుంది.
2. పుస్తకాలు చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానము పెరుగుతుంది. ఈ ఏడాది బుక్స్ బాగా చదవాలని రిజొల్యూషన్ పెట్టుకుంది ఈ అందాల రాశి.
3. స్క్రీన్ టైమ్ కట్ చేస్తోందట. సోషల్‌మీడియలో…ముఖ్యంగా ఇన్‌స్టాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది రాశి ఖన్నా. అయితే ఈసారి ఫోన్ తక్కువగా వాడాలని పరిమితి పెట్టుకుంది.
4. ఎక్కువగా నవ్వాలి. ఎక్కువగా ద్యానం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ద్యానం చేయాలి. మనసు సంతోషంగా ఉండేందుకు నవ్వాలి. అంటే ఎక్కువ నిరాశలో మునిగిపోకుండా ఈ ఏడాది నవ్వుతూ ఉండాలని ఫిక్స్ అయింది.
5. సినిమా షూటింగ్‌లకని, హాలీడేలకు అని ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటారు హీరోయిన్స్. కానీ ఈ ఏడాది టైమ్ తీసుకొని మరీ ఎప్పుడు వెళ్లని ఒక ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేయాలని రాసిపెట్టుకుంది.
6. ఇక చివరగా అందరి మనసులు దోచుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే కుర్రాళ్ల మనసులను దోచుకున్న ఈ బ్యూటీ ..మంచి సినిమాలతో..తాను చేసే పనులతోనూ ఈసారి మరింత ఎక్కువ మంది హృదయాలను దోచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం