నటీనటులు : గెటప్ శ్రీను, అంకితా కరాట్, హేమంత్, ఆనంద్ చక్రపాణి, నమని ప్రశాంత్ తదితరులు
డైరెక్టర్ : కృష్ణమాచారి. కె
సినిమాటోగ్రాఫర్ : సాయిరాం ఉదయ్
సంగీతం : సురేష్ బొబ్బిలి, హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటింగ్ : బొంతల నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి, స్వాతి పసుపులేటి
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజు యాదవ్’ (Raju Yadav). అంకిత కరాట్ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో గెటప్ శ్రీను నటన సినిమాపై అంచనాలను పెంచింది. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం ఇవాళ (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది?
కథేంటి
ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా రూపొందింది. రాజు యాదవ్ (గెటప్ శ్రీను) ఊరిలో చాలా సరదాగా ఉండే అబ్బాయి. ఓ రోజు క్రికెట్ ఆడుతుండగా అతడికి ప్రమాదం జరుగుతుంది. దీంతో ఓ వైద్యుడ్ని సంప్రదిస్తాడు. ఆ వైద్యుడు వచ్చి రాని చికిత్స చేయడంతో రాజు స్మైలింగ్ డిజార్డర్ అనే వ్యాధి బారిన పడతాడు. అప్పటి నుంచి రాజు నవ్వుపై నియంత్రణ కోల్పోతాడు. సందర్భంతో సంబంధం లేకుండా నవ్వుతూనే ఉంటాడు. అలా స్విటీ (అంకితా)తో ప్రేమలో పడినప్పుడు అతడికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అప్పుడు రాజు ఏం చేశాడు? రాజు ప్రేమకు అతడి నవ్వు ఎలాంటి చిక్కులు తెచ్చిపెట్టింది? రాజు-స్విటీ ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హాస్య నటుడు గెటప్ శ్రీను.. రాజు యాదవ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి.. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ అదరగొట్టాడు. అటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ తాను అద్భుతంగా నటించగలనని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. ప్రేయసి పాత్రలో అంకితా కరాట్ పర్వాలేదనిపింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. ఇక తండ్రి పాత్రలో ఆనంద్ చక్రపాణి చక్కటి నటన కనిబరిచాడు. తండ్రి కొడుకుల ఎమోషన్‌ను అద్భుతంగా పండించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కృష్ణమాచారి.. ఓ మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఫన్, ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాను నడిపించారు. స్మైలింగ్ డిజార్జర్ అనే సమస్యతో హాస్యాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. అదే సమయంలో ఆ డిజార్డర్ చుట్టే భావోద్వేగ సన్నివేశాలను అల్లుకొని ప్రేక్షకుల హృదయాలకు సినిమా హత్తుకునేలా చేశారు. ముఖ్యంగా గెటప్ శ్రీను, ఆనంద్ చక్రపాఠి మధ్య వచ్చే తండ్రి కొడుకుల ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. అయితే అక్కడక్కడ స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపించింది. కొన్ని సీన్లు సాగదీతలా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. కానీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. భావోద్వేగ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- గెటప్ శ్రీను నటన
- కామెడీ
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- సాగదీత సీన్స్
- ఎడిటింగ్
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్