• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rebel on OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’ హీరోయిన్ లేటెస్ట్‌ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

    మలయాళ బ్యూటీ ‘మమితా బైజు’ (Mamita Baiju).. ‘ప్రేమలు’ (Premalu) చిత్రంలో తెలుగులోనూ స్టార్‌గా మారిపోయింది. ఇందులో మమిత నటనకు తెలుగు యూత్‌ ఫిదా అయ్యింది. తమ కలల రాణిగా మమితను మార్చుకుంది. మమితా బైజును ఏకంగా సాయిపల్లవితో ప్రశంసలు కూడా వచ్చాయి. ‘ప్రేమ‌లు’ త‌ర్వాత మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ మ‌మితా బైజుకు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవల తమిళంలో ఆమె నటించిన రెబల్‌ చిత్రం విడుదలై పాజిటివ్‌ తెచ్చుకుందా. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్‌ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

    స్ట్రీమింగ్ ఎక్కడంటే?

    సంగీత దర్శకుడు జీవి ప్రకాష్‌, మ‌మితా బైజు జంటగా న‌టించిన త‌మిళ మూవీ ‘రెబెల్’ (Rebel).. మార్చి 22న థియేట‌ర్ల‌లో రిలీజైంది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంతోనే మ‌మితా బైజు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime).. విడుదలయ్యి రెండు వారాలు కాకుండానే ఈ సినిమాను స్ట్రీమింగ్‌లోకి తీసుకువచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. 

    కథేంటి?

    క‌థిరేస‌న్ ఓ మ‌ల‌యాళీ కుర్రాడు. ఉన్న‌త చ‌దువుల కోసం మున్నార్ నుంచి పాల‌క్కాడ్ వ‌స్తాడు. అక్క‌డ కొంద‌రు త‌మిళ స్టూడెంట్స్‌తో జ‌రిగిన గొడ‌వ క‌థిరేస‌న్ జీవితాన్ని ఎలాంటి మ‌లుపు తిప్పింది. కాలేజీ గొడ‌వ‌గా మొద‌లైన ఈ ఇష్యూ.. రాజ‌కీయ రంగ‌ును ఎలా పులుముకుంది? సారా అనే అమ్మాయితో అతడి ప్రేమ ట్రాక్‌ ఎలా మెుదలైంది? ఆమె ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డం కోసం అతడు ఎలాంటి పోరాటం చేశాడ‌ు? అన్నది రెబెల్ మూవీ క‌థ‌. 

    సినిమా ఎలా ఉందంటే?

    కేర‌ళ‌లోని మున్నార్‌కు చెందిన ఓ స్టూడెంట్ జీవితంలో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు నికేష్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.  కేరళలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా కథను నడిపించి డైరెక్టర్‌ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. తమిళం, మలయాళ స్టూడెంట్స్‌ మధ్య తరచూ జరిగే గొడవలను డైరెక్టర్‌ కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. జీవి ప్రకాశ్ అద్భుతంగా నటించాడు. ప్రేమలు బ్యూటీ మమితా బైజుకు నటనకు స్కోప్ దక్కింది. సినిమాలోని బీజీఎమ్‌ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. సిద్ధూ కుమార్ మంచి సంగీతాన్ని ఈ చిత్రానికి అందించాడు. అరుణ్ రాధా కృష్ణన్ కెమెరా వర్క్‌ అద్భుతంగా ఉంది. కీలక సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు. అయితే దర్శకుడు నికేష్ తాను అనుకున్న పాయింట్‌ను ప్రజెంట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. సెకండాఫ్‌లో భావోద్వేగాలను పండించే సన్నివేశాలకు అవకాశం ఉన్నప్పటికీ.. వాటిని తీసుకురాలేదు. తమిళ్, మలయాళం విద్యార్థుల మధ్య గోడవలకు గల అసలైన కారణాన్ని  బాగా చెప్పలేదు.  ఈ చిత్రం అంతిమంగా మత రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి నచ్చుతుంది. ఎందుకంటే చాలా సన్నివేశాలు అనేక రాజకీయ కోణాలతో ముడిపడి ఉంటాయి.

    Telugu.yousay.tv Rating : 2.5/5
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv