• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Redmi A2 series : రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. ఎంట్రీ లెవెల్ ఫీచర్లతో మార్కెట్‌లోకి..!

    ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రెడ్‌మీ.. మరో రెండు బడ్జెట్‌ ఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. రెడ్‌మీ A2, రెడ్‌మీ A2+ ఫోన్లను భారత్‌లో మే 19న లాంచ్‌ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో వీటిని తీసుకొస్తున్నట్లు చెప్పింది. Redmi A2 series మెుబైల్‌ ప్రియులకు కచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది. గతేడాది రెడ్‌మీ లాంచ్‌ చేసిన A1 series ఫోన్స్ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్‌మీ తీసుకొస్తున్న A2 seriesపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో A2 series ప్రత్యేకతలు, ధర ఎంటో ఇప్పుడు చూద్దాం.

    ఫోన్‌ డిస్‌ప్లే

    Redmi A2, Redmi A2+ ఫోన్లు ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తున్నాయి. 6.52 అంగుళాలతో HD+ స్క్రీన్‌ కలిగి ఉంది. ఇందులో IPS LCD స్క్రీన్‌ వాడారు. 

    బ్యాటరీ:

    Redmi A2 సిరీస్‌ ఫోన్లను 5000mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. 10W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని ఫోన్‌కు అందించారు. 

    స్టోరేజీ

    Redmi A2 సిరీస్‌ ఫోన్స్‌ 2GB / 3GB RAM వేరియంట్లలో రానుంది. ఇది 32GB ఇంటర్నల్‌ స్టోరేజీ కెపాసిటీని కలిగి ఉంది. expandable memoryను 1TB వరకూ పెంచుకోవచ్చని రెడ్‌మీ తన స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది. 

    కెమెరా

    Redmi A2 సిరీస్‌ ఫోన్స్‌ ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరాలతో వస్తోంది. ఫ్రంట్‌ 5MP, బ్యాక్‌ 8MP కెమెరాతో LED ఫ్లాష్‌ లైట్‌ కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్‌లో డ్యూయల్‌ సిమ్స్‌ వాడొచ్చు. రెండు సిమ్స్‌, ఒక మెమెరీ కార్డును ఉపయోగించవచ్చు. 

    4G మాత్రమే

    Redmi A2 సిరీస్‌ ఫోన్స్‌ 5Gకి సపోర్టు చేయదు. ఇది 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్‌ 5.0, GPS + GLONASS ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ లేదు. 

    కలర్స్‌

    Redmi A2 సిరీస్‌ ఫోన్లు మూడు రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. Black, Light Blue, Light Green రంగుల్లో మీకు నచ్చిన కలర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    Redmi A2 ఫోన్‌ ధర రూ. 8,999/- వరకూ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మే 19 ఉదయం 11 గంటలకు వీటి ధరలు అధికారికంగా తెలియనున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv