తారక్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ‘NTR 31‘ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా గుర్తింపు పొందిన తారక్ సరసన నటిస్తుందన్న వార్తలు రావడంతో ఈ అమ్మడి పేరు ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
బెంగళూరులో పుట్టిన రుక్మిణీ వసంత్‌ది ఆర్మీ బ్యాగ్రౌండ్. తండ్రి వసంత్ వేణుగోపాల్ ఆర్మీలో కల్నల్‌గా చేశారు. 2007లో జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ వద్ద జరిగిన పోరులో మరణించారు.
ఆయన మరణానంతరం అశోక చక్రతో అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. రుక్మిణి తల్లి పేరు సుభాషిణీ. భరత నాట్యంలో ఆమెకు ప్రావీణ్యం ఉంది.
రుక్మిణీ వసంత్ ఆర్మీ స్కూల్‌లో చదువుకుంది. నటనపై ఆసక్తితో లండన్ వెళ్లి బ్లూమ్స్ బరీలోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్ నుండి పట్టా పొందింది.
2019లో ‘బీర్బల్ కేస్ 1’ అనే కన్నడ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. అదే ఏడాది ‘అప్‌స్టార్స్’తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది.
‘సప్త సాగరాలు దాటి – ఏ, బి’ చిత్రాల్లో ప్రియా అనే పాత్రలో రుక్మిణీ నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది.
ప్రియా పాత్రకు గాను సైమాలో ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకుంది. క్రిటిక్స్ విభాగంలో ఈ అవార్డు అందుకోవడం గమనార్హం.
ప్రస్తుతం తెలుగులో నిఖిల్‌కు జోడీగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం చేస్తోంది. తెలుగులో రుక్మిణీ చేస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఇదే.
దీంతోపాటు విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రానున్న చిత్రానికి సైతం హీరోయిన్‌గా ఈ అమ్మడు ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.
అటు తమిళంలో విజయ్ సేతుపతితో ఏస్ (Ace) అనే చిత్రంలో రుక్మిణీ నటిస్తోంది. అలాగే శివకార్తికేయన్‌తో ‘SKxARM’ అనే ప్రాజెక్ట్ చేస్తుంది.
అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్‌తో ‘భైరాతి రణగల్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్‌లో రిలీజ్ కానుంది. దాంతోపాటు బాఘీరా అనే మరో కన్నడ ఫిల్మ్‌లోనూ ఈ ముద్దు గుమ్మ నటిస్తోంది.
రుక్మిణీకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమట. కోన్ లేదా కప్ అనే తేడా లేకుండా ఎంచక్కా లాగించేస్తుందట.
రుక్మిణీకి డ్యాన్స్‌పై మంచి పట్టుంది. ఖాళీ సమయాల్లో డ్యాన్స్ చేస్తుండటం, ట్రావెలింగ్‌కు వెళ్లడం వంటివి చేస్తుంటానని ఈ అమ్మడు చెప్పింది.