నటీనటులు: వెంకటేష్, శ్రద్ద శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా తదితరులు
దర్శకత్వం: శైలేష్ కొలను
సంగీతం: సంతోష్ నారాయణ్
నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్
నిర్మాత: వెంకట్ బోయినపల్లి
శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్(Venkatesh) హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. వెంకటేష్ కెరీర్లో ఇది 75వ సినిమా (Saindhav Movie Review). బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, బేబీ సారా ఇందులో కీలక పాత్రలు పోషించారు. శ్రద్ధ శ్రీనాథ్ వెంకటేష్‌కు జోడీగా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 13న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? వెంకటేష్ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథ
సైంధవ్ (Venkatesh) తన పాపతో(బేబీ సారా) కలిసి చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో జీవిస్తుంటాడు. ఓ రోజు పాప కళ్లు తిరిగిపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాప ప్రాణాంతక జబ్బుతో బాధపడుతుందని తెలుస్తుంది. అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్టు క్యాంప్ నడుస్తుంటుంది. సైంధవ్ ఉగ్రవాద చర్యలకు అడ్డుతగులుతాడు. అసలు ఉగ్రవాదులకు సైంధవ్‌కు ఏంటి సంబంధం? గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దికీ), ఆర్య పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే
సైంధవ్ పాత్రలో వెంకటేష్ (Saindhav Movie Review) అద్భుత నటన కనబరిచాడు. ఎమోషన్, యాక్షన్ సన్నివేశాల్లో తన మార్క్ నటన కనబరిచి మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో వెంకీ తన విశ్వరూపం చూపించాడు. సైంధవ్, పాపకు దగ్గరయ్యే పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath) ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ది (Nawazuddin Siddiqui)కి విలన్ పాత్రలో అదరగొట్టాడు. అతని అసిస్టెంట్‌గా, లేడీ విలన్‌గా ఆండ్రియా కూడా మెప్పిస్తుంది. తమిళ నటుడు ఆర్య పర్వాలేదనిపిస్తాడు. శ్రద్ద శ్రీనాధ్ మాజీ భర్త పాత్రలో గెటప్ శ్రీను సీరియస్‌గా కనిపించినా కామెడీని పండిస్తాడు.
ఎలా సాగిందంటే
గతాన్ని వదిలేసి దూరంగా బతుకుతున్న హీరోకి ఓ సమస్య వస్తే మళ్ళీ ఆ గతంలోని మనుషులు రావడం అనేది చాలా సినిమాల్లో చూశాము. సైంధవ్ సినిమా కథ (Saindhav Movie Review in Telugu) కూడా ఇంచుమించు అలాంటిదే. ఫస్ట్ హాఫ్ అంతా సైంధవ్, తన కూతురు మధ్య ప్రేమ, పాపకు జబ్బు ఉందని తెలియడం, కంటైనర్లు గురించి గొడవ, సైంధవ్ మళ్ళీ తిరిగొచ్చాడు అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ సైంధవ్ కి పెట్టే ఇబ్బందులు, వాటిని తట్టుకొని సైంధవ్ ఎలా నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ఓ పక్క పిల్లల ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క స్టైలిష్ యాక్షన్ సీన్స్ సాగుతాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu) చాలా రొటిన్ కథను తీసుకున్నారు. ‘సైంధవ్’ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో చూసిన భావన కలుగుతుంది. కమల్‌హాసన్ ‘విక్రమ్’, రజనీకాంత్ ‘జైలర్’ సినిమాను మళ్లీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. కథ, కథనం కంటే కూడా వెంకటేష్, నవాజుద్దీన్ క్యారెక్టర్లపైనే డైరెక్టర్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఆర్య, ముఖేష్ రుషి, రుహానీ శర్మ వంటి స్టార్ నటులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిదీ రొటిన్ పాత్రలాగే తీర్దిదిద్దారు డైరెక్టర్. సన్నివేశాల మధ్య కనెక్షన్ ఉండదు. దీని వల్ల ప్రేక్షకులు కథతో ప్రయాణం చేయడంలో ఇబ్బంది ఎదురువుతుంది.. అయితే యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం శైలేష్ తన మార్క్‌ను చూపించాడు. వెంకీ మామ చేత విశ్వరూపాన్ని చూపించేశారు. ఓవరాల్‌గా యాక్షన్ ప్రియులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కథ, లాజిక్ పక్కన పెడితే సైంధవ్ మెప్పిస్తాడు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో, బుజ్జికొండవే సాంగ్‌లో మ్యూజిక్ మనసుకి హత్తుకుంటుంది. మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్‌గా అనిపించింది. వెంకీ మామని చాలా స్టైలిష్‌గా చూపించారు. చంద్రప్రస్థ అనే ఊరిని, సముద్రం లొకేషన్స్, పోర్ట్.. అన్నిటిని చాలా చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- వెంకటేష్ నటన
- భావోద్వేగ సన్నివేశాలు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- కొత్తదనం లేని కథ
- లాజిక్కు అందని సీన్స్
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్