అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ సేల్స్‌ఫోర్స్ సీఈవో మార్క్ బెనియోఫ్ జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకం. చిన్నతనం నుంచే ఇంటర్నెట్‌పై అపారమైన నాలెడ్జి సంపాదించిన ఇతను స్వతహాగా ఐటీ అప్లికేషన్లు, గేమ్స్ రూపొందించి విక్రయించేవాడు. ఐటీ రంగంపై ఇంత పట్టుసాధించిన మార్క్ ఆపిల్ సంస్థతో తనకున్న ఆసక్తికర అనుబంధాన్ని వెల్లడించాడు.
ఇంటర్న్‌గా కెరీర్ ఆరంభం
1976-1977లో ప్రారంభమైన ఆపిల్ సంస్థ ఇంటర్నెట్ రంగంలో కొత్తపుంతలు తొక్కుతూ అప్పుడప్పుడే వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐటీ రంగంపై ఆసక్తి ఉన్న మార్క్ 1984లో ఆ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయడానికి జాయిన్ అయ్యాడు. 19 ఏళ్ల వయసులోనే స్టీవ్ జాబ్స్, గై కవాసకిలతో కలిసి పనిచేశాడు. తన హైస్కూల్ ఫ్రెండ్స్‌తో ఒక చిన్న సాఫ్ట్‌వేర్ సంస్థను రన్ చేస్తూనే ఇంటర్న్‌షిప్ కొనసాగించాడు.
కెరీర్‌లో ఉన్నత స్థాయి వ్యక్తిగా ఎదగడానికి ఆపిల్ సంస్థ ఎంతో దోహదపడిందని వివరించారు. ‘అప్పట్లో స్టీవ్ జాబ్స్, గై కవాసకిలతో కలిసి పనిచేయడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది. ఆపిల్ సంస్థలో వర్క్ కల్చర్‌తో పాటు ఒక పనిని విజయవంతంగా ఎలా పూర్తి చేయాలో నేర్చుకున్నానన్నాడు. బాబ్స్, గై ఉద్యోగులందరికీ ఎంతో సపోర్టివ్‌గా నిలిచేవారన్నాడు. ఆ సంస్థలో దాదాపు 70 అసెంబ్లీ ప్రోగ్రామ్స్ రాసినట్టు పేర్కొన్నాడు. టెక్నాలజీ సంబంధింత అంశాలు మెరుగ్గా నేర్చుకున్నానని.. అవి భవిష్యత్తులో చాలా ఉపయోగపడ్డాయని మార్క్ పేర్కొన్నాడు.
ఇంటర్న్ టూ సీఈవో
ఐటీ సంస్థను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకున్న మార్క్ బెనియాఫ్ 1999లో సేల్స్‌ఫోర్స్ సంస్థను ప్రారంభించాడు. క్లౌడ్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ ఆటోమేషన్ సర్వీసులు అందించి ఒక బిలియనీర్ సంస్థకు సీఈవోగా ఎదిగాడు. ఈ సంస్థలో దాదాపు 60 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ రెవెన్యూ 2021లో 21.25 బిలియన్లు ఉంది. ఫార్చున్స్(Fortune) 100 బెస్ట్ కంపెనీస్ టు వర్క్ జాబితాలో సేల్స్‌ఫోర్స్ 2వ స్థానంలో నిలవడం విశేషం.
సేల్స్‌ఫోర్స్ సంస్థ అభ్యున్నతి సాధించడానికి స్టీవ్ జాబ్స్ చాలా సందర్భాల్లో సాకారాలు అందించారని, అందరికంటే ఎక్కువగా సలహాలు ఇచ్చారని మార్క్ బెనియాఫ్ 2011లో పేర్కొనడం గమనార్హం.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి