శాకుంతలం మూవీ నుంచి సమంత కొత్త లుక్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. దేవ కన్యలా సమంత న్యూలుక్ సూపర్బ్‌గా ఉంది. అభరణాలు పొదిగిన వస్త్రాలను ధరించి సామ్ మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమంత లుక్ అదిరిందంటూ పోస్టులు పెడుతున్నారు. స్టన్నింగ్ లుక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
శాకుంతలం చిత్రం కోసం సామ్ సరికొత్తగా మేకోవర్ అయ్యింది. ఆమెను అత్యంత సుందరంగా తయారు చేసేందుకు బాగా శ్రమించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక బృందం కష్టపడింది. సమంతని పువ్వులతో తయారు చేసేందుకు వివిధ రకాల డిజైన్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల విడుదలయ్యింది.
యశోద చిత్రం తర్వాత సామ్ నుంచి వస్తున్న సినిమా శాంకుతలం. వరుసగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్… దీనికోసం కూడా బాగానే కష్టపడింది. మయోసైటిస్ సమస్యలు వేధించినా షూటింగ్ పూర్తి చేసింది.
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. గుణశేఖర్ సినిమాను తీర్చిదిద్దారు. దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మణిశర్మ మ్యూజికల్‌లో వస్తున్న శాకుంతలం చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. సినిమా హిట్ అవుతుందని సమంతతో పాటు చిత్రబృందం నమ్ముతోంది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్