• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Samantha: సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సామ్! 

  టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో సమంత (Samantha Ruth Prabhu) ఒకరు. అనారోగ్యం రిత్యా కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. సోషల్‌ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. తన గ్లామర్‌ పోస్టులతో తరచూ వారికి హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నెబులైజర్‌ వాడకంపై ఆమె పెట్టిన పోస్టు.. వివాదానికి దారి తీసింది. దీనిపై వైద్యుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఓ డాక్టర్‌ ఏకంగా సమంతను జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదస్పదమైంది. దీనికి సమంత కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్‌ కౌంటర్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఇంతకీ నెట్టింట రచ్చరేపుతున్న ఈ వివాదానికి గల కారణాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం. 

  సమంత హెల్త్‌టిప్‌ ఇదే!

  ప్రముఖ నటి సమంత.. మయోసైటిస్‌ అనే వ్యాధి బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. తాను తీసుకుంటున్న వైద్యాన్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నెబులైజేషన్‌ గురించి ఆమె పోస్టు పెట్టారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మందులు వాడండి అంటూ నెబులైజేషన్‌లో ఉపయోగించాల్సిన కొన్ని ఔషధాలు సూచించారు. ‘హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్ట్ వాటర్ రెండూ కలిపి నెబులైజర్ చేయండి. ఇది అద్భుతంగా పని చేస్తుంది. అనవసరంగా ట్యాబ్లెట్స్ వాడకుండా ఇలా ప్రయత్నించండి’ అంటూ సమంత తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాకుండా దీన్ని తనకు సూచించిన మిత్ర బసు చిల్లర్ అనే వైద్యురాలిని కూడా పోస్టుకు ట్యాగ్‌ చేశారు. ఈ పోస్టు నిమిషాల వ్యవధిలోనే నెట్టింట వైరల్‌గా మారింది. 

  సమంతను జైల్లో పెట్టాలి: డాక్టర్‌

  సమంత పెట్టిన పోస్టు వైరల్‌ కావడంతో.. ఇది చూసిన పలువురు డాక్టర్స్ మండిపడ్డారు. సమంతపై సోషల్‌ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. సమంత ఇచ్చిన హెల్త్ టిప్ తప్పు అని సూచించారు. ముఖ్యంగా డాక్టర్ అబీ ఫిలిప్స్ అనే డాక్టర్‌ ఈ విషయంలో మరింత ఘాటుగా స్పందించారు. ‘TheLiverDoc’ పేరుతో ఉన్న తన ఎక్స్‌ ఖాతాలో సమంతపై విరుచుకుపడ్డారు. సమంత చెప్పినట్లు చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమంతకు హెల్త్‌ గురించి, సైన్స్‌ గురించి తెలియదని నిరక్షరాస్యురాలంటూ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నందుకు ఆమెను జైలులో పెట్టాలని లేదా జరిమానా విధించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

  సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌

  తనను జైల్లో పెట్టాలంటూ డాక్టర్‌ ఇచ్చిన వార్నింగ్‌పై నటి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘ఒక ట్రీట్‌మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా సలహా ఇచ్చేంత అమాయకురాలిని కాదు. 5 ఏళ్లుగా డీఆర్డీవోకు సేవలందించిన, ఎండీ అర్హత కలిగిన డాక్టరే నాకు ఈ చికిత్సను సూచించారు. ఒక పెద్దమనిషి నా పోస్టును, నా ఉద్దేశాలను చాలా బలమైన పదాలతో దూషించాడు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. ఆయన నా గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన్ని గౌరవించేదాన్ని. నన్ను జైల్లో పెట్టాలని ఆయన విమర్శించినందుకు నాకు బాధలేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటాను. కానీ, నేను సెలబ్రిటీగా ఆ హెల్త్‌ టిప్‌ ఇవ్వలేదు.. ఒక సామాన్యమైన వ్యక్తిగా పోస్ట్‌ చేశాను’ అని సామ్‌ రాసుకొచ్చింది. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv