ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో ఆధునాతన 5G స్మార్ట్‌ఫోన్ విడుదలకు సిద్ధమైంది. Samsung Galaxy F54 5G పేరుతో జూన్ 6న ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. శాంసంగ్ గ్యాలక్సీ సిరీస్‌కు భారత మార్కెట్‌లో మంచి పేరు ఉండటంతో ప్రతీ ఒక్కరిలోనూ ఈ ఫోన్‌పై ఆసక్తి పెరిగింది. పైగా ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ కూడా మంగళవారం (మే 30) నుంచే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? ధర ఎంత ఉండొచ్చు? వంటి అంశాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఫోన్ డిస్‌ప్లే
Samsung Galaxy F54 5G స్మార్ట్‌ఫోన్‌ను 6.7 అంగుళాల FHD + Super AMOLED Plus స్క్రీన్‌తో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. Samsung Exynos 1380 ప్రొసెసర్, Android v13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్ పనిచేయనుంది
బిగ్ బ్యాటరీ
Samsung Galaxy F54 5G ఫోన్‌ను 6000 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది.
కెమెరా
Samsung Galaxy F54 5G ఫోన్‌లో కెమెరానే హైలెట్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ వెనుకవైపున 108 MP + 8 MP + 2 MP కెమెరా సెటప్‌ను అమర్చారు. ప్రైమరీ కెమెరా 108MP ఉండటంతో అత్యంత నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఇక ఫ్రంట్ వైపున 32 MP సెల్పీ కెమెరాను ఫిక్స్ చేశారు.
స్టోరేజ్ సామర్థ్యం
Galaxy F54 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAMతో రానుంది. 128 GB స్టోరేజ్ సామర్థ్యంతో దీనిని తీసుకొస్తున్నారు. ఈ స్టోరేజ్ కెపాసిటీని 1TB వరకూ పెంచుకోవచ్చని స్పెసిఫికేషన్స్‌లో శాంసంగ్ పేర్కొంది.
సెన్సార్స్
Samsung Galaxy F54 5G ఫోన్ స్క్రీన్ పైనే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. అలాగే లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్, గైరోస్కోప్ ఈ ఫోన్‌లో అదనపు ఫీచర్లుగా ఉన్నాయి.
కలర్స్
ఈ నయా గ్యాలక్సీ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో ఇది మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ప్రీ-బుకింగ్స్
ప్రస్తుతం Samsung Galaxy F54 5G ఫోన్ ప్రీ-బుకింగ్స్ జరుగుతున్నాయి. ఫ్లీప్‌కార్ట్ లేదా శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.999 చెల్లించి ఫోన్ బుక్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే రూ.2000 వరకూ రాయితీ పొందొచ్చని శాంసంగ్ తెలిపింది.
ధర ఎంతంటే?
Samsung Galaxy F54 5G ఫోన్ ధరను శాంసంగ్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ రూ.29,999 లకు అందుబాటులోకి రావొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 6న ఫోన్ ధరపై స్పష్టత రానుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం