ఫాస్ట్‌ఫుడ్‌లలో శాండ్‌విచ్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. భారత్‌లో దీన్ని ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్‌గా చెబుతుంటారు. పిల్లల నుంచి పెద్దవారి వరకూ ప్రతీ ఒక్కరూ శాండ్‌విచ్‌ను ఇష్టపడుతుంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైనా, సాయంత్రం స్నాక్స్‌గా తినడానికైనా శాండ్‌విచ్‌లు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే చాలా మంది శాండ్‌విచ్‌ల కోసం తమ సంపాదనలో ఎక్కువ మెుత్తం ఖర్చు చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. పైగా సుచి, శుభ్రత లేని రెస్టారెంట్లలో వీటిని కొనడం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది. కాబట్టి మన అభిరుచికి అనుగుణంగా ఎంతో ఇష్టమైన సాండ్‌విచ్‌లను ఇంట్లోనే చేసుకోవచ్చు. శాండ్‌విచ్ తయారీకి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని వస్తువులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటిలోని టాప్ జాబితాను YouSay మీ ముందుకు తెచ్చింది. అవేంటో మీరే చూడండి.
Prestige 800W Sandwich Maker
దీని సాయంతో శాండ్‌విచ్‌ను ఎంతో తేలిగ్గా ప్రీపేర్ చేసుకోవచ్చు. Prestige 800W Sandwich Maker నాన్‌స్టిక్ కోటింగ్ కలిగి ఉంది. దీని వల్ల శాండ్‌విచ్ పాత్రకు అతుక్కుపోదు. మేకర్ పైభాగంలో పవర్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఆయిల్ లేకుండా కూడా దీనిపై శాండ్‌విచ్ చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.1,795. అమెజాన్ దీనిపై 28% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా రూ.1,299లకు ఈ మేకర్ అందుబాటులోకి వచ్చింది.
Wipro Vesta Grill
ఈ శాండ్‌విచ్ మేకర్ కూడా నాన్‌స్టిక్ కోటింగ్‌తో తయారైంది. దీనిపై 2 సంతవ్సరాల వారంటీ కూడా ఉంది. ఇది త్వరగా వేడి ఎక్కడంతో పాటు శాండ్‌విచ్‌ను చాలా త్వరగా అందిస్తుంది. పెద్ద సైజు శాండ్‌విచ్‌లను సైతం దీనిపై తేలిగ్గా చేసుకోవచ్చు. Wipro Vesta Grill అసలు ధర రూ.3,099 కాగా, అమెజాన్ దీనిని రూ. 2,079కే అందిస్తోంది.
Borosil Prime Grill Sandwich Maker
దీనిపై ఒకేసారి రెండు పెద్ద సైజు శాండ్‌విచ్‌లను తయారు చేయవచ్చు. 1200 గ్రాముల బరువున్న ఈ మేకర్.. 10 Watts సామర్థ్యాన్ని కలిగి ఉంది. హీట్ ఇష్యూస్ లేకుండా కూల్ టచ్ హ్యాండిల్‌ను దీనికి అమర్చారు. ఈ హ్యాండిల్.. మేకర్ ఆన్‌లో ఉన్న కూడా కాలదు. అమెజాన్‌లో ఇది రూ. 1,799 లభిస్తోంది.
iBELL Sandwich Maker
మీరు తక్కువ నూనెతో తయారు చేసిన శాండ్‌విచ్‌లను తినడానికి ఇష్టపడితే మీ దగ్గర ఈ iBELL Sandwich Maker ఉండాల్సిందే. ఈ శాండ్‌విచ్ మేకర్‌లో తయారు చేసిన శాండ్‌విచ్‌లు మీకు రుచికరంగా ఉంటాయి. ఇది విషపూరితం కాని సిరామిక్ పూతను కలిగి ఉంటుంది. ఇది డిఫరెంట్ టైప్ శాండ్‌విచ్ మేక్ ప్లేట్లతో వస్తుంది. అమెజాన్‌లో రూ.2,139 అందుబాటులో ఉంది.
AGARO Galaxy Sandwich Maker
ఈ శాండ్‌విచ్ మేకర్‌తో మీకు ఇష్టమైన గ్రిల్డ్ శాండ్‌విచ్‌ను సులభంగా తయారు చేయవచ్చు. AGARO Galaxy Sandwich Maker నాన్‌స్టిక్ గ్రిల్లింగ్ ప్లేట్లు ఇవ్వబడ్డాయి. ఇది కూల్ టచ్ హ్యాండిల్, లాంగ్ పవర్ కార్డ్‌ని కలిగి ఉంది. ఏడాది వారంటీ కలిగిన ఈ శాండ్‌విచ్ మేకర్.. అమెజాన్‌లో రూ.2,299లకు లభిస్తోంది.
Havells Perfect Fill
హవెల్స్.. మంచి నాణ్యత కలిగిన శాండ్‌విచ్ మేకర్లను తయారు చేస్తోంది. ఈ కంపెనీకి చెందిన Havells Perfect Fillకు వినియోగదారుల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. ఇది కూల్ టచ్ హ్యాండిల్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ. 2,495 కాగా, అమెజాన్ 48% రాయితీతో ఈ మేకర్‌ను అందిస్తోంది. ఫలితంగా దీన్ని రూ.1,298 దక్కించుకోవచ్చు.
Bajaj SWX 4 Sandwich Maker
రూ.1000 లోపు ఉన్న శాండ్‌విచ్ మేకర్స్‌లో Bajaj SWX 4 Sandwich Maker బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇది నియోన్ ఇండికేటర్‌ను కలిగి ఉంది. నాన్‌స్టిక్ ప్లేట్లతో తయారైన ఈ శాండ్‌విచ్ మేకర్‌ను ఈజీగా శుభ్రం చేయవచ్చు. దీని అసలు ధర రూ.2,125. కానీ, అమెజాన్ దీన్ని రూ.999కి ఆఫర్ చేస్తోంది.