• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sankranti Special Food Items In Andhra: సంక్రాంతిలో ఆరోగ్యాన్ని కాపాడే ఈ ఆంధ్రా పిండి వంటల గురించి తెలుసా?

    ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి శోభ మెుదలైంది. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు ఈ అతిపెద్ద పండగను జరుపుకునేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా సంక్రాంతి అంటే ఆంధ్రాలో నోరూరించే పిండివంటలు గుర్తుకువస్తాయి. ఊళ్లల్లో వారం ముందు నుంచే పిండి వంటల హడావిడి మొదలవుతుంది. అరిసెలు, చక్రాలు, సకినాలు, పూర్ణాలు, కజ్జికాయాలతో సంక్రాంతి పండుగ గొప్ప తియ్యదనాన్ని తీసుకొస్తుంది. అయితే ఈ పిండి వంటలు రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సైతం అందిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    అరిసెలు (Ariselu)

    సంక్రాంతికి చేసే స్పెషల్ పిండి వంటల్లో (Sankranti Special Food Items In Andhra) అరిసెలు ముందు వరుసలో ఉంటాయి. ఆంధ్ర ప్రజలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే అరిసెలను సంక్రాంతి మెుదటి ప్రాధాన్యతా పిండి వంటకంగా చెప్తారు. దీనిని బియ్యపు పిండి, బెల్లం, నూనె, నువ్వులతో చేస్తారు. అరిసెల తయారీలో వాడే బెల్లం రక్తాన్ని శుద్ది చేయడానికి సాయపడుతుంది. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను మెరుగు పరుస్తుంది. 

    పొంగలి (Sweet Pongal)

    సంక్రాంతికి ప్రతీ ఒక్కరు పొంగలి చేసుకుంటారు. ముఖ్యంగా దీనిని భోగీకి స్పెషల్‌గా చేస్తుంటారు. పాలు, కొత్త బియ్యం, బెల్లం, యాలకులు, పెసరపప్పుతో పొంగలిని తయారు చేస్తారు. పాల వినియోగం వల్ల పొంగలిలో క్యాల్షియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది. ఇందులోని బెల్లం రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాలకులు శరీరంలోని విషపదార్థాలను తొలిగించి శ్వాసవ్యవస్థను పటిష్టం చేస్తాయి.

    సకినాలు (Sakinalu)

    సంక్రాంతికి ఎంతో ఇష్టంగా చేసుకునే మరో పిండివంట ‘సకినాలు’. బియ్యపు పిండి, వాము, నువ్వులు, ఉప్పు, నూనెతో తయారు చేస్తారు. సకినాలులో ఫైబర్‌, ప్రోటిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో వాడే వాము యాంటీ బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే నువ్వుల్లో మెగ్నీషియం, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి డయాబెటిస్‌ రాకుండా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

    జంతికలు / చక్రాలు (Janthikalu)

    బియ్యప్పిండి, పుట్నాల పొడి, వాము, ఉప్పు, కారం, సరిపడ నీళ్లతో ఈ పిండి వంటకాన్ని తయారు చేస్తారు. ఇది ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తాయి. ఉప్పులోని పోషకాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక బియ్యప్పిండిలో ఫైబర్‌, వాములో యాంటీ వైరల్‌ గుణాలు మన ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. 

    పాకుండలు / పూర్ణాలు (Pakundalu)

    ఈ పిండి వంటకాన్ని కూడా సంక్రాంతి (Sankranti Special Food Items In Andhra)కి చాలా ఇష్టంగా ఆరగిస్తుంటారు. బెల్లం, యాలకులు, కొబ్బరి తురుము, నెయ్యి, బియ్యప్పిండితో దీన్ని తయారు చేస్తారు. ఈ పూర్ణాలలో ఫైబర్‌, ప్రోటీన్లు, ఖనిజాలు, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మలబద్దకం సమస్యను దరిచేరకుండా చేస్తుంది. ఇందులో వాడే నెయ్యి శరీరంలోని అనవసర కొవ్వులను కరిగించి బరువు తగ్గడానికి సాయపడుుతుంది.

    సున్నుండలు (Sunnundalu) 

    ఈ వంటకాన్ని మినపప్పు, బెల్లం, పుట్నాలు, యాలకుల పొడి, నెయ్యితో తయారు చేస్తారు. మినపప్పులో శరీరానికి కావాల్సిన ప్రొటిన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీవ క్రియల రేటును పెంచుతాయి. అలాగే ఇందులోని యాలకులు నోటి దుర్వాసనను దూరం చేసి శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తాయి. రోగ నిరోధక శక్తిని పటిష్టం చేయడంలో సున్నుండలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

    కజ్జికాయలు (Karanji Recipe)

    సంక్రాంతికి చేసే మరో ముఖ్యమైన వంటకం కజ్జికాయలు (Kajjikayalu). కొబ్బరి కోరు, బెల్లపుపాకం, గోధుమ పిండిని ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. ఇది కూడా రుచితోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. 

    పూత రేకులు (Pootharekulu)

    గోదావరి జిల్లాల్లో పూతరేకులు చాలా ఫేమస్‌. సంక్రాంతికి పూతరేకులు ప్రతీ ఇంట్లో చేస్తుంటారు. గంజి, బియ్యపు పిండితో మట్టి కుండపై పూతరేకులు చేస్తారు. వీటిపై డ్రైఫ్రూట్స్‌, బెల్లం, పంచదార, నెయ్యి ఇలా వివిధ పదార్థాలు వేసి చుడతారు. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

    నువ్వుల ఉండలు (Nuvvula Laddu)

    నువ్వులు బెల్లం కలిపి ఈ ఉండలు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వుల్లో చాలా ప్రొటిన్స్‌, విటమిన్స్‌ ఉంటాయి. బెల్లంలో ఉండే ఐరన్‌ రక్తహీనతను తగ్గిస్తుంది. వీటిని సంక్రాంతికే పరిమితం చేయకుండా ఏడాది పొడవునా చేసుకొని తింటే ఎంతో మంచిది. 

    గోరుమిటీలు (Gorumitilu)

    ఇవి సంక్రాంతికి చేసే మరో పిండి వంటకం. దీనిని బొంబాయి రవ్వ, మైదా పండి, చక్కెర లేదా బెల్లంతో చేస్తారు. గోరుమిటీలు (Sankranti Special Food Items In Andhra) తక్కువ ఖర్చుతో చేసే రుచికరమైన స్వీట్ అని చెప్పవచ్చు.

    కొబ్బరి బూరెలు (Kobbari Boorelu)

    దీని తయారీకి బియ్యప్పిండి, కొబ్బరి, నువ్వుల పిండి, బెల్లం, ఉపయోగిస్తారు. పాకం పట్టేందుకు పంచదార లేదా బెల్లం వాడతారు. అరిసెల తర్వాత ఆ స్థాయి రుచిని కొబ్బరి బూరెలు అందిస్తాయి. కార్బొహైడ్రేట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv