మహేశ్‌బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట మూవీ రిలీజ్‌కి ముందే రికార్డులు బద్ధలు కొడుతుంది. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, లిరికల్ వీడియోలు, టీజర్లు, పోస్టర్లు ఇప్పటికే సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచాయి. దీనికి తోడు యూట్యూబ్, ఇన్‌స్టా, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రతి అప్‌డేట్ వైరల్‌గా మారింది. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ అభిమానుల అంచనాలను ఆకాశానికి పెంచింది. ఈ నేపథ్యంలో SVP రిలీజ్‌కి ముందే మరో రికార్డును దక్కించుకుంది. అదేంటో మీరూ చూసేయండి.
Book My Showలో ఘనత
ఇప్పటి వరకు వీడియోలు, పోస్టర్లు, ట్రైలర్‌తో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ తాజాగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లోనూ సత్తా చాటుతుంది. టికెట్ బుకింగ్స్ యాప్ బుక్ మై షో ప్రతి సినిమా ఉపోద్ఘాతాన్ని, ఆన్‌లైన్ టికెట్లను అభిమానులకు అందుబాటులో ఉంచుతుంది. కొత్తగా రిలీజ్‌కానున్న ప్రతి సినిమా సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంటుంది. దీంతో సినీ ప్రేమికులు మూవీ టికెట్లను బుక్ చేసుకోవడంతో పాటు మూవీ చూడటానికి ఆసక్తి కనబర్చితే ఇంట్రెస్ట్ అనే ఐకాన్‌పై క్లిక్ చేస్తుంటారు. ఇలా మే 12న రిలీజ్‌కానున్న మహేశ్‌బాబు సినిమాను చూడటానికి దాదాపు 4 లక్షల 14 వేయిల మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి ఘనతలు సాధించిన సినిమాలు చాలా తక్కువ కాగా.. వాటిలో SVP కూడ నిలవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
RRR మూవీని SVP దాటుతుందా..?
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీపై కూడ రిలీజ్‌కి ముందే బుక్ మై షో యాప్‌లో 1 మిలియన్స్‌కి పైగా ఇంట్రెస్ట్ చూపించారు. కాని ఈ చిత్రం పాన్ ఇండియా కావడంతో అంతమాత్రం రావడం పెద్దగా గొప్పేమి అనిపించలేదు. కాని కేవలం తెలుగు భాషల్లోనే రిలీజ్ అవుతున్న SVP మూవీ ఇప్పటికే 414.7k ఇంట్రెస్టులను పొందింది. ఈ మూవీ ఒక్క భాషల్లోనే ఇంత ఘనత సాధించడంతోపాటు రిలీజ్‌కి ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో యాప్‌లో ఇంట్రెస్ట్ చూపించేవారి సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సితార మెరుస్తుందా..?
మహేశ్‌బాబు గారాల కూతురు సితార ఈ చిత్రంలో నటిస్తుందో లేదో క్లారిటీ లేనప్పటికీ ఓ సాంగ్‌లో మాత్రం గెస్ట్ రోల్ పోషించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల రిలీజైన పెన్నీ అనే లిరికల్ వీడియోలో అదిరిపోయే స్టెప్పులేసి అందరిచేత శెభాష్ అనిపించుకుంది. పాటలో నటించినట్లు అభిమానులు భావిస్తున్నారు. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం