‘కలగను-కష్టపడు-సాధించు’(dream-work-achieve) ఇది సూర్య కుమార్ యాదవ్(surya kumar yadav) ట్విటర్ బయో. అదే సూత్రంతో ముందుకు సాగుతూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు ఈ క్రికెటర్. ఈ యేడు అద్భుతమైన ఫామ్‌తో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్నాడు. తనకు ఎటువంటి సవాళ్లు విసిరినా స్వీకరిస్తూ సాటిలేని మేటి ఆటగాడినని నిరూపిస్తున్నాడు. అనితర సాధ్యమైన షాట్లు ఆడుతూ మిస్టర్ 360 (mr.360) ఏబీ డివిల్లీర్స్ ఆటను గుర్తుచేస్తున్నాడు. ఈ యేడు సూర్య సాధించిన విజయాలే ఆందుకు తార్కాణాలు.
2022లో అదరగొడుతున్న సూర్య కుమార్
ఈ ఏడాది మొత్తం 11 ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ యాదవ్ 404 పరుగులు సాధించి 2022లో అత్యుత్తమ ఇండియన్ టీ20 బ్యాటర్‌గా ప్రశంసలందుకుంటున్నాడు. సూర్య సగటు 40.40గా ఉందంటే అతడు ఏ స్థాయి ఫామ్‌లో ఉన్నాడో అర్థమవుతుంది. స్ట్రైక్ రేట్ కూడా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. 190.56 స్ట్రైక్ రేట్‌తో అతడు ఈ పరుగులను సాధిస్తున్నాడు. ఏడాది కాలంలో ఓ సెంచరీ(117), రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తంగా చూసినా భారత్ తరఫున తొలి 20 టీ20 ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన జాబితాలో సూర్య రెండో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ తొలి 20 మ్యాచుల్లో 47సగటు,153 స్ట్రయిక్ రేటుతో 755 పరుగులు చేయగా, సూర్య కుమారు 38 సగటు, 176 స్ట్రయిక్ రేటుతో 648 పరుగులు చేశాడు.
సవాళ్ల స్వీకరణ
ఎటువంటి సవాళ్లు విసిరినా సూర్య కుమార్ స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సూర్యను ఓపెనర్‌గా పంపించారు. తొలి రెండు మ్యాచుల్లో విఫలమైనా మూడో మ్యాచులో తన సత్తా చాటాడు. కేవలం 44 బంతుల్లోనే 76 పరుగులు చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు.
నంబర్ 1 కు అడుగు ఒక్క అడుగే
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ సూర్య కుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ అజామ్ 818 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, సూర్య కుమార్ యాదవ్ 816 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
అభిమానుల్లోనూ సూర్యకు మంచి పేరుంది. వివాదాలకు జోలికి వెళ్లకుండా తన ఆటపైనే దృష్టిపెట్టే వ్యక్తిత్వం సూర్య ప్రదర్శనకు భంగం కలగకుండా చూసుకుంటోంది. త్వరలోనే సూర్య నంబర్ 1 స్థానానికి దూసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!