ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రబృందం ఈ మేరకు ప్రకటన చేసింది. ‘రామ కార్యం నెరవేర్చడానికి మేం కట్టుబడి ఉన్నాం’ అంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇంకా 150 రోజులు అంటూ ప్రభాస్ విడుదల తేదీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.