• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాబు బెయిల్‌పై అంబటి సెటైర్లు

    AP: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ లభించడంపై మంత్రి అంబటి రాంబాబు ట్విటర్‌ (X) వేదికగా స్పందించారు. బాబుకు బెయిల్‌ వచ్చింది నిజం గెలిచి కాదని పేర్కొన్నారు. కళ్లు కనిపించడం లేదని కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిందని ఎద్దేవా చేశారు. స్కిల్‌ స్కాం కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఐదు కండిషన్లు విధిస్తూ నవంబర్‌ 28 వరకు బెయిల్‌ ఇచ్చింది.

    పవన్‌ చంద్రబాబుకు పనివాడు: అంబటి

    AP: చంద్రబాబు జైలులో శత దినోత్సవాలు జరుపుకొంటారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆయన జైలుకెళ్లి 50 రోజులు దాటిన నేపథ్యంలో అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన తప్పులే ఆయన్ను జైలుకు వెళ్లేలా చేశాయని మంత్రి అన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్‌కు అండగా ఉన్న తనపై దాడులు చేస్తున్నారన్నారు. ఓ సామాజికవర్గం వారే తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా కోసం ఎంతదూరమైనా వెళ్తానని చెప్పారు. అటు పవన్‌ మనవాడు కాదని చంద్రబాబు దగ్గర పనివాడని అంబటి ధ్వజమెత్తారు.

    నన్ను చంపేందుకు కుట్ర: మంత్రి అంబటి

    టీడీపీ నేతలు తనను చంపేందుకు కుట్రచేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంపిన వారికి రూ.50 లక్షలు ఇస్తామని కూడా ప్రకటించారని తెలిపారు. కమ్మం ఓ ప్రేవేటు కార్యక్రమానికి వెళ్తే టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఖమ్మంలో నాకు నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేయించారు. నిన్న గోధుముల బస్తా కారుపై పడటం, నేడు నాపై దాడికి ప్రయత్నించడం నన్ను చంపేందుకు కుట్రలో భాగమే దీనిపై పోలీసులు విచారణ జరపాలి’. అని అంబటి పేర్కొన్నారు.

    అందుకే పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటారు: అంబటి

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌కు స్వాంత రాజకీయ ఆలోచన లేదన్నారు. చివరకు లోకేష్ పల్లకి మోసేందుకు పవన్ రెడీ అయ్యారని విమర్శించారు. టీడీపీని కాపాడేందుకు పవన్ ప్రత్నిస్తున్నాడని చెప్పారు. అందుకే పవన్‌ని ప్యాకేజీ స్టార్ అంటారని ఎద్దేవా చేశారు. సున్నా సున్నా కలిస్తే వచ్చేది సున్నానే అని టీడీపీ-జనసేన కలిస్తే కూడా అంతేనన్నారు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే జైల్లో ఉన్నారని అంబటి ఆరోపించారు.

    నిజమే.. నిజమే గెలుస్తుంది: అంబటి

    చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అంబటి అన్నారు. ‘నిజమే.. అందరం నిజం గెలవాలనే కోరుకుంటున్నాం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నిజం గెలుస్తుంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు. గత 45 రోజుల నుంచి నిజమే గెలుస్తోంది కాబట్టే చంద్రబాబు ఇంకా జైళ్లో ఉన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు 17ఏ సాకుగా చూపి బయటపడేందుకు పాకులాడుతున్నారు అని అంబటి ఆరోపించారు.

    చంద్రబాబు, లోకేష్‌ వాగుడుతోనే ఇదంతా: అంబటి

    చంద్రబాబు, లోకేష్‌ వాగుడుతోనే ఇక్కడ దాకా తెచ్చుకున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్నేం చేయలేక పోయాడు. జగన్ నన్ను ఏం పీకుతాడన్న చంద్రబాబు మాటలకు సమాధానం ఇప్పుడు వచ్చింది. రెండు పీకి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. టీడీపీ పాలనలో చేసిన దోపిడీ బయటపడింది. పైగా కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారు. అదే అయితే మొదటి సంవత్సరమే లెక్క చూసే వాళ్లం. ఆధారాలు బయట పడ్డాయి కాబట్టే సీఐడీ అరెస్ట్‌ చేసింది’ అని చెప్పుకొచ్చారు.

    ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్: మంత్రి అంబటి

    తమకు కక్ష సాధించాల్సిన అవసరం లేదని.. చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు అరెస్టు చేశారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, 175 స్థానాల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని అంబటి అన్నారు. ఈ నెల 26 నుంచి బస్సు యాత్రతో పాటు ‘మళ్లీ జగనే ఎందుకు కావాలి’ అనే కార్యక్రమం సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    పవన్ పూటకో మాట: అంబటి

    అవినీతిలో మునిగి తేలినవాళ్లు జైళ్లో మహాత్మగాంధీ జయంతి రోజున దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి దీక్షలు చేస్తున్నవారిని చూస్తే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. పవన్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్నటిదాక బీజేపీతో పొత్తు అని ఇప్పుడు టీడీపీతో మాత్రమే పొత్తు అని అంటున్నారని చురకలు అంటించారు. కేవలం కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పవన్ సభలు పెడుతున్నారని ఆరోపించారు.

    యువతులతో అంబటి ఊరమాస్ స్టెప్పులు

    ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ ఉన్న మహిళలు, యువతులతో డ్యాన్స్‌ చేశారు. భోగి వేడుకలు చూసేందుకు వచ్చిన వారికి హుషారెత్తించారు.