• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రహదారులపై స్పెషల్‌ డ్రైవ్‌: జగన్‌

    AP: రహదారుల మరమ్మతులకు స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షాకాలం ముగిసినందున నగరాలు, పట్టణాల్లో రహదారుల పనులపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. ‘నగరాల్లో వివిధ దశల్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలి. విశాఖలో రహదారుల విస్తరణ, ట్రాఫిక్‌ నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి. విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనం, రాజమహేంద్రవరంలో హేవ్‌లాక్‌ బ్రిడ్జి సుందరీకరణ, వరదల వల్ల నెల్లూరు మునిగిపోయే పరిస్థితులు రాకుండా రక్షణ గోడ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలి’ అని అన్నారు.

    రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్భంధించారు: భువనేశ్వరి

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చంద్రగిరిలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..చంద్రబాబుపై మోపిన స్కిల్‌, రింగ్‌రోడ్డు, ఫైబర్‌నెట్‌ కేసులో ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి గురించి ఏ మాత్రం ధ్యాస లేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డి పనిచేశారని చెప్పారు. రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో నిర్భంధించారని భువనేశ్వరి అన్నారు.

    ఏపీ ప్రభుత్వంపై పురందేశ్వరి ఫైర్

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో కల్తీ మద్యం తయారవుతుందని ఆరోపించారు. ఆయా కంపెనీల ఆరోపణలపై సీఎం జగన్ ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాలతో జగన్ ప్రభుత్వం చలగాటం అడుతోందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రా: మాజీ మంత్రి

    చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజల కోసం జీవితాన్నిఅంకితం చేసిన వ్యక్తిని జైలులో పెట్టడం సరికాదు. జగన్ జైలులో ఉన్నంత మాత్రాన అందురిని జైలులకు పంపాలా? చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు. జగన్ చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రచేస్తున్నారు. జగన్ పాలనలో ప్రజలు సుఖంగా లేరు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుంది’. అని మోత్కుపల్లి విమర్శించారు.

    సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాలి: లోకేశ్

    AP: తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ‘దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం – మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం’ అంటూ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య‌ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయాలని లోకేశ్‌ కోరారు. నాలుగున్నరేళ్లుగా అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దామని ట్వీట్ చేశారు.

    అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం

    ఇంద్రకీలాద్రిలో కనకదుర్గ అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎంకు ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని సీఎంకు అందజేశారు.

    ‘జగనన్న పండగోస్తుంది మా జీతాలన్నా’

    టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చంద్రన్న హయాంలో దసరా, దీపావళి, రంజాన్ వంటి ప్రముఖ పండుగలకు వారం ముందే జీతాలందుకున్న రోజుల నుంచి… జగనన్న పండగోస్తుంది మా జీతాలన్నా.. మమ్మల్ని కరుణించన్న అనే రోజులు వచ్చాయి….అమ్మో ఒకటో తేదీ..ఇది పాత మాట.. ఇప్పుడు ఆ తేదీనే మర్చిపోయిన రోజులు ఇవి..వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన జీతాలు పడిన సంఘటనలు అరుదులో అరుదు’ అని గంటా పేర్కొన్నారు.

    విశాఖ నుంచే పాలన: సీఎం జగన్

    విశాఖలో పర్యటనలో భాగంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్‌ నాటికి విశాఖ రాబోతున్నట్లు వెల్లడించారు. ఇకపై అక్కడి నుంచే పరిపాలనా విభాగమంతా పనిచేస్తుందని తెలిపారు. విశాఖకు ఉజ్జ్వల భవిష్యత్‌ ఉందని చెప్పారు. త్వరలో విశాఖ మరింత అభివృద్ధి చెందబోతోందని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్‌ నాటికి తాను కూడా విశాఖకు రాబోతున్నానని సీఎం జగన్‌ వెల్లడించారు.

    16న ఉత్తరాంధ్రలో జగన్ పర్యటన

    AP: సీఎం జగన్‌ ఈ నెల 16న విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తారు. ఉ. 9 గం.లకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖలోని ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను సీఎం ప్రారంభిస్తారు. తర్వాత హెలిప్యాడ్‌ వద్ద జీవీఎంసీ బీచ్‌ క్లీనింగ్‌ మిషన్లు ప్రారంభిస్తారు. దాని తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియా స్టెరైల్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారు. తర్వాత అచ్యుతాపురంలో లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

    కక్ష సాధింపు కోసమే చంద్రబాబు అరెస్ట్: లోకేష్

    అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబును జైలులో పెట్టారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేష్ ములాఖత్‌ అయ్యారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెడుతున్నాడు. స్కిల్‌ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతని చెప్పి తర్వాత రూ.300 కోట్లు అంటున్నారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. వైసీపీ అక్రమాలపై న్యాయపోరాటం కొనసాగిస్తాం’. అని లోకేష్ పేర్కొన్నారు.