• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు అరెస్టు బాధాకరం: తలసాని శ్రీనివాస్‌

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ స్పందించారు. చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పట్ల జగన్ అనుసరిస్తున్న తీరు విచారకరమన్నారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.

    పట్టు వదలని పవన్ కళ్యాణ్

    AP: వాలంటీర్ల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టు వదలట్లేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను అడుగుతున్న 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ‘వాలంటీర్ల బాస్‌ ఎవరు? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు? ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?’ అని పవన్‌ ట్వీట్ చేశారు. Everyone’s concern is same .. my dear Watson!. Data privacy laws … Read more

    ముగ్గురిపై ధ్వజమెత్తిన సీఎం జగన్

    AP: ‘నేతన్న నేస్తం’ నిధులు విడుదల చేశాక చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్‌లపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ‘ఒకరేమో పట్టపగలు మందు తాగుతూ, స్విమ్మింగ్ పూల్ పక్కనే అమ్మాయిలతో డాన్సులు చేస్తుంటాడు. అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అని మరకొరు అంటారు. 70 ఏళ్లు వచ్చినా సిగ్గు లేకుండా షోలకి వెళ్లి బావా నువ్వు సినిమాల్లోనే చేశావు కానీ నేను నిజ జీవితంలో చేశానని మరొకడు అంటాడు’ అంటూ జగన్ ధ్వజమెత్తారు. లోకేష్ పట్టపగలు మందు తాగుతూ, స్విమ్మింగ్ … Read more

    ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ

    ఏపీ హైకోర్టు తరలింపు అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు … Read more

    మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు అర్ధగంట పాటు వీరి సమావేశం కొనసాగింది. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన 14 అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రధానిని జగన్ కోరారు. కాగా నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం జగన్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.

    Ap; గవర్నర్‌ను కలసిన సీఎం దంపతులు

    [వీడియో; ](url)ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. గవర్నర్ దంపతులకు పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. శుక్రవారం ఏపీ గవర్నర్‌గా నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఏపీ గవర్నర్‌గా ఉన్న హరిచందన్ విశ్వభూషణ్ బదిలీపై చత్తీస్‌గఢ్ వెళ్లిన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ … Read more

    నా తమ్ముడయ్య స్వామి: జగన్

    వైఎస్ ఆర్ జిల్లా పర్యటనలో సీఎం జగన్ కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో [వైరల్](url) అయ్యింది. మూడ్రోజుల పర్యటన ముగించుకొని వెళ్తుండగా ఓ వ్యక్తి అర్జీ ఇచ్చేందుకు వెళ్లాడు. దాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డికి అందించమని సీఎం సూచించారు. కానీ, అతడు మాత్రం ముఖ్యమంత్రికే ఇవ్వాలని ప్రయత్నించగా ఎంపీని చూపిస్తూ ఆయనెవరో కాదు..నా తమ్ముడే కద స్వామి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. భద్రతా సిబ్బంది ఎంపీని నిలువరిస్తుంటే సీఎం ఇలా స్పందించారని తెలుస్తోంది. Security refuses to allow MP Avinash … Read more

    ఏపీ సీఎం జగన్ ఎమోషనల్

    ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని పారుమంచాలలో ధర్మారెడ్డి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు. కొడుకు మరణంతో దుఖిస్తున్న ధర్మారెడ్డిని చూసి జగన్ కూడా ఎమోషనల్ అయ్యారు. కాగా మరో నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా చంద్రమౌళి చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

    చిన్నారికి పెన్ ను గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం జగన్

    AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పెదపూడి లంకలో వరద బాధితులతో సీఎం జగన్ ఓ చిన్నారిని ఎత్తుకుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆ బుడ్డోడు సీఎం జేబులోని పెన్ను లాగాడు. అది కాస్త కిందపడింది. వెంటనే అందరూ కంగారు పడ్డారు. దీంతో సీఎం జగన్ చిరు నవ్వు నవ్వుతూ.. ఆ పెన్ ను ఆ చిన్నారికి బహుమతిగా అందించాడు. ఆ పెన్ విలువ రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ వీడియో … Read more

    వాహనమిత్ర నిధులు విడుదల చేసిన జగన్

    AP: వైఎస్సార్‌ వాహనమిత్ర కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10వేల చొప్పున సీఎం జగన్ జమ చేశారు. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో 2,61,516 కుటుంబాలకు రూ.261.51 కోట్లు బటన్ నొక్కి ట్రాన్స్ ఫర్ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ “ఆటో, ట్యాక్సీ నడుపుతున్న కుటుంబాలు తమకు తాము స్వయం ఉఫాధిని కల్పించుకుంటున్నాయి. తమ కుటుంబాలను పోషించుకుంటూ, స్వశక్తిమీద ఆధారపడుతున్నాయి. ప్రతిరోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి” అని పేర్కొన్నారు. స్వయంగా ఆటో యూనిఫామ్ ధరించిన జగన్ ఆటో ఎక్కి డ్రైవర్లను ఉత్సాహపరిచారు. "ఆటో, ట్యాక్సీ నడుపుతున్న … Read more

    Categories AP