• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.100 కోట్ల క్లబ్‌లో ‘భగవంత్‌ కేసరి’

    బాలకృష్ణ లేటెస్ట్‌ మూవీ ‘భగవంత్‌ కేసరి’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.104 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా తెలిపారు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టడంపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషించారు. థమన్‌ సన్సేషన్‌ మ్యూజిక్‌ సమకూర్చాడు.

    భగవత్ కేసరి రికార్డు బుకింగ్స్

    భగవంత్ కేసరి అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతోంది. నిన్న టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవగా హాట్‌ కేక్‌ల్లాగా అమ్ముడు పోతున్నాయి. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో హౌస్‌ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కాగా ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీలీల బాలకృష్ణ కూతురుగా నటించింది. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. మహిళా సాధికారత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

    శ్రీలీల గ్లిజరిన్ పెట్టకున్నా ఏడ్చేసింది: బాలయ్య

    భగవంత్ కేసరి ప్రెస్‌ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడారు. భగవంత్ కేసరి మహిళా సాధికారతను హైలైట్ చేస్తూ తెరకెక్కిన చిత్రం. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ పరిశీలిస్తే అతడి చిత్రాలు అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి. నా కూతురి పాత్రలో శ్రీలీల అద్భుతంగా నటించారు. ఎమోషనల్ సీన్లలో గ్లిజరిన్ అవసరం లేకుండా జీవించారు అంటూ ప్రశంసలు కురిపించారు. మంచి భవిష్యత్ ఉందంటూ ఆశీర్వదించారు. థమన్ అందించిన సాంగ్స్, బీజీఎం బాగుందని చెప్పుకొచ్చారు.

    బాలయ్యకు అపార అనుభం: శ్రీలీల

    భగవంత్ కేసరి ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన హీరోయిన్ శ్రీలీల బాలయ్యపై ప్రశంసలు కురిపించింది. ‘బాలయ్య కూతురని ఫస్ట్ చెప్పినప్పుడు కొంచెం వెనకడుగు వేశాను. గ్లామర్ రోల్స్ ఎప్పుడైన చేయవచ్చు. కానీ నటనకు అవకాశం ఉన్న విజ్జి పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాను. బాలయ్య ఇంక్రిడబుల్ మ్యాన్. ఆయన నుంచి షూటింగ్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కేవలం నటన పరంగానే కాదు. సమాజంలోని ఇతర విషయాలపై ఆయనకు ఆపార అనుభవం ఉంది అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోరిక మేరకు బాలయ్యతో శ్రీలీల డ్యాన్స్ చేసి … Read more

    భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర్ బుకింగ్స్ స్టార్ట్

    దసరా బరిలోకి దిగుతున్న బాలయ్య సినిమా భగవంత్ కేసరి, రవితేజ చిత్రం టైగర్ నాగేశ్వర్‌రావు అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. అలాగే తమిళ్ డబ్బింగ్ చిత్రం విజయ్ నటించిన లియో సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. భారీ అంచనాలతో ఈ మూడు సినిమాలు దసరా బరిలో పోటీపడుతున్నాయి. టైగర్ నాగేశ్వర్‌రావు, భగవంత్ కేసరి సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

    అన్‌స్టాపబుల్ సీజన్-3 డేట్స్ ఫిక్స్

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో సీజన్-3 ఈనెల 17 నుంచి ఆహాలో టెలికాస్ట్ కానుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ‘బాలయ్య నటించిన భగవంత్ కేసరి’ మూవీ టీం సందడి చేయనుంది. డెరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు కాజల్, శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్‌తో కూడిన ఫొటోలను విడుదల చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. బాలకృష్ణ మరోసారి ఈ ప్రోగ్రామ్‌లో సందడి చేయనుండటంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ 19న రిలీజ్ కానుంది.

    త్వరలో అన్‌స్టాపబుల్ సీజన్-3

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో సీజన్-3 త్వరలో ప్రారంభం కానుంది. మొదటి రెండు సీజన్లకు మించి ఈసారి వినోదం పంచేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దసరా నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీ టీం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా, బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది.

    ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

    నిన్న విడుదలైన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 5 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు.

    బాలకృష్ణపై శ్రీలీల ప్రశంసలు

    నట సింహం నందమూరి బాలకృష్ణపై నటి శ్రీలీల ప్రశంసలు కురిపించింది. జీవితంలో మర్చిపోలేని అనుభూతులు బాలయ్య తనకు అందించారని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘నేను బాలకృష్ణ కుమార్తె పాత్రలో నటించాను. కొన్ని సీన్లు చేసేటప్పుడు కట్ చెప్పినప్పటికీ ఎమోషనల్ మూడ్‌ నుంచి బయటకు రాలేకపోయాను’’ అని చెప్పింది. ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కించారు.

    ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

    నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘గణేష్ ఆంతం’ పేరుతో ఓ సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీలలు నటించారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ విడుదల కానుంది.