బాలీవుడ్ నటుడుకి ఈడీ సమన్లు
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఓ ఆన్‌లైన్ గేమింగ్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు రణ్‌బీర్ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆ బెట్టింగ్ యాప్ మాటున జరుగుతున్న ఓ భారీ కుంభకోణాన్ని ఇటీవల ఈడీ బట్టబయలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ యాప్‌కు ప్రచారకర్తగా ఉన్న రణ్‌బీర్‌ను ఈ నెల 6న విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.