• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసుపత్రి నుంచి పాడెపై మృతదేహం తరలింపు

    AP: అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మానవ సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగు చూసింది. ముంచంగిపట్టు మండల కేంద్రం ఓ ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పాడెపై మృతదేహాన్ని మోసుకెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. జెడ్పీ ఛైర్‌పర్సన్ ఫోన్ చేసినా అంబులెన్స్ ఇవ్వలేదు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు పాడె కట్టి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మోసుకెళ్లాల్సి వచ్చింది.

    చంద్రబాబును ఆస్పత్రికి తరలిస్తారా?

    AP: తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్న రాత్రి రాజమహేంద్రవరం GGH ఆస్పత్రిలో ఉన్న వీఐపీ చికిత్స గదిని అధికారులు అత్యవసరంగా పరిశీలించారు. గదిలో రెండు ఆక్సిజన్‌ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్‌, వెంటిలేటర్‌, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారు. దీన్ని బట్టి ఆయన్ను ఆస్పత్రికి తరలించే ఛాన్స్‌ ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

    హాస్పిటల్ బెడ్డుపై సమంత

    హీరోయిన్ సమంత హాస్పిటల్ బెడ్డుపై ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందులో చేతికి సెలైన్ పెట్టించుకుంటూ కనిపించింది. అలాగే మందుల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి మరో పోస్ట్ పెట్టింది. తనకు ఈ డ్రిప్సే ఇమ్యూనిటీని అందిస్తాయని చెప్పింది. ఇమ్యూనిటీ వల్ల కలిగే లాభాలను వివరిస్తూ.. రక్త కణాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి పెరుగుదల, హృదయానికి రక్త సరఫరా ఈ డ్రిప్పే ఉపయోగపడతాయి అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఆమె పోస్ట్‌పై నెటిజన్లు బిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

    బిర్యానీ తిని 40 మందికి అస్వస్థత

    బిర్యానీ తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వరంగల్‌లోని బట్టుపల్లి ఎస్సార్ ప్రైమ్ క్యాంపస్‌లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి విద్యార్థులందరూ క్యాంపస్ క్యాంటీన్‌లో చికెన్ బిర్యానీ తిన్నారు. సోమవారం ఉదయం 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఓ ఆస్పత్రికి తరలించారు. వారిలో 15 మంది డిశ్చార్చి అయ్యారు. మరో 15 మందికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వరంగల్ – భట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ ప్రైవేట్ కాలేజీ క్యాంపస్‌లో ఫుడ్ … Read more

    హీరోయిన్ కోసం ఆస్పత్రినే బుక్ చేసిన హీరో

    ఒకప్పటి హీరోయిన్ హేమమాలిని కోసం ఆమె భర్త, హీరో ధర్మేంద్ర 100 పడకల ఆస్పత్రి మొత్తం బుక్ చేసినట్లు ఆసక్తికర విషయం బయటికొచ్చింది. 1981లో హేమమాలిని డెలివరీ కోసం ఏకంగా ఆస్పత్రి మొత్తం బుక్ చేశారట. ఈ విషయాన్ని హేమమాలిని స్నేహితురాలు నీతూ కోహ్లీ చెప్పారు. హేమ ప్రసవించిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. హేమమాలిని ఆ సమయంలో ఈషా డియోల్‌కు జన్మనిచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

    అమానుషం; రోగిని ఈడ్చుకెళ్లిన తల్లిదండ్రులు

    [వీడియో:](url) తెలంగాణలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో వీల్ చైర్ లేక తమ కుమారుడిని తల్లిదండ్రులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి ఓ వ్యక్తిని అతడి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో రెండో అంతస్తులో ఉన్న వైద్యుడి వద్దకు వెళ్లేందుకు ఆ రోగిని తల్లిదండ్రులు నేలపై ఈడ్చుకుంటూ వెళ్లారు వీల్ చైర్ లేకనే వారు ఈడ్చుకుంటూ తీసికెళ్లినట్లు తెలుస్తోంది. వీల్ చైర్ తీసుకొచ్చేలోపే ఈడ్చుకెళ్లినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. This video is said to be from … Read more

    తారకరత్న ఫైటర్; మంచు మనోజ్

    నందమూరి తారకరత్న ఓ ఫైటర్ అని.. ఆయన కోలుకుని మన ముందుకు వస్తారని ప్రముఖ హీరో [మంచు మనోజ్](url) అన్నారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్నను మనోజ్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. ఆయన కోలుకుంటున్న తీరుకు వైద్యులు సంతృప్తికరంగానే ఉన్నారని చెప్పారు. పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారని కోరుకున్నారు. కాగా యువగళం యాత్రలో తారకరత్నకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. . @HeroManoj1 Anna About "#TarakaRatna Anna Health Condition ? pic.twitter.com/BMSDyEHxDy — VishnuVarthanReddy?CEO … Read more

    అకారణంగా చెప్పు దెబ్బలు

    ఓ వ్యక్తిపై అక్కడున్న మహిళ అకారణంగా చెప్పుతో కొట్టింది. చత్తీస్‌గడ్‌లోని ఓ ఆస్పత్రిలో ఒక వ్యక్తి ఓపీ విభాగం వద్ద పడుకున్నాడు. పక్కనే ఉన్న కూలర్ కూడా ఆన్ చేసుకుని పడుకున్నాడు. ఇంతలో ఓ మహిళ వచ్చి కూలర్ ఆఫ్ చేసి అతడిపై దాడికి దిగింది. చెప్పుతో ఎడాపెడా కొట్టి, కాలితో వీపుపై తన్నుతూ అతడిని బయటకి పంపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దాడిపై హాస్పిటల్ మేనేజ్‌మెంట్ స్పందించటానికి నిరాకరించింది. #Chhattisgarh के #ambikapur #medical #collage … Read more