• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జైలులో చంద్రబాబుకు ప్రాణహాని: లోకేష్

    ‘భ‌ద్ర‌త‌లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ‌న‌కి ప్రాణ‌హాని తల‌పెడుతున్నారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఎన్న‌డూ ఏ త‌ప్పూ చేయ‌ని 73 ఏళ్ల చంద్ర‌బాబు ప‌ట్ల రాక్ష‌సంగా వ్య‌వ‌హ‌రిస్తోంది ఈ ప్ర‌భుత్వం. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్ర‌బాబు గారిని అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే ప్ర‌ణాళిక ఏదో ర‌చిస్తున్నారు. చంద్ర‌బాబు గారి ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్ప‌దంగా ఉంది. చంద్ర‌బాబు ఏ హాని జ‌రిగినా, సైకోజ‌గ‌న్ బాధ్య‌త‌’ … Read more

    చంద్రబాబు, లోకేష్‌ వాగుడుతోనే ఇదంతా: అంబటి

    చంద్రబాబు, లోకేష్‌ వాగుడుతోనే ఇక్కడ దాకా తెచ్చుకున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్నేం చేయలేక పోయాడు. జగన్ నన్ను ఏం పీకుతాడన్న చంద్రబాబు మాటలకు సమాధానం ఇప్పుడు వచ్చింది. రెండు పీకి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. టీడీపీ పాలనలో చేసిన దోపిడీ బయటపడింది. పైగా కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారు. అదే అయితే మొదటి సంవత్సరమే లెక్క చూసే వాళ్లం. ఆధారాలు బయట పడ్డాయి కాబట్టే సీఐడీ అరెస్ట్‌ చేసింది’ అని చెప్పుకొచ్చారు.

    చంద్రబాబుకు మద్దతుగా ‘కాంతితో క్రాంతి’

    చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు వినూత్న కార్యక్రమం చెప్పట్టారు ‘కాంతితో క్రాంతి’ పేరుతో టీడీపీ నిరసన చేపట్టింది. రాత్రి 7 గంటల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఇళ్లలో లైట్లు ఆపి, దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, దిల్లీలో లోకేష్, హైదరాబాద్‌లో బ్రాహ్మణి దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

    కక్ష సాధింపు కోసమే చంద్రబాబు అరెస్ట్: లోకేష్

    అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబును జైలులో పెట్టారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేష్ ములాఖత్‌ అయ్యారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెడుతున్నాడు. స్కిల్‌ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతని చెప్పి తర్వాత రూ.300 కోట్లు అంటున్నారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. వైసీపీ అక్రమాలపై న్యాయపోరాటం కొనసాగిస్తాం’. అని లోకేష్ పేర్కొన్నారు.

    చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైంది: బ్రాహ్మణి

    టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. టీడీపీ “కాంతితో క్రాంతి” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం అని బ్రాహ్మణీ పిలుపునిచ్చారు.

    లోకేష్ సీఐడీ విచారణ వాయిదా

    ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత లోకేష్ సీఐడీ విచారణ వాయిదా పడింది. ఈ కేసులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం లోకేష్ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో బుధవారం విచారణకు రావాలని లోకేష్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

    మా కుటుంబానికి ఇది కష్టకాలం: భువనేశ్వరి

    చంద్రబాబు భద్రతపై ఆయన సతీమణి నార భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవారు. కుటుంబంకంటే ప్రజలే తనకు ముందర అనేవారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తిని ఆయన నిర్మించిన జైలులోనే కట్టిపడేశారు. ప్రజాపోరాటానికి ఏపీ ప్రజలంతా సహకరించాలి. మా కుటుంబానికిది కష్టకాలం ఇది. రాష్ట్రప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉండాలి’ అని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. https://x.com/GlintInsights/status/1701619853613039855?s=20

    లోకేశ్ కాళ్లకు బొబ్బలు; భోరున ఏడ్చిన టీడీపీ నేత

    [వీడియో:](url) టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో లోకేశ్ అరి కాలికి ఏర్పడిన బొబ్బలను తలుచుకుని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. లోకేశ్ తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను చూసినట్లుగా ఇప్పుడు లోకేశ్‌ను చూడటానికి జనం వస్తున్నారని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రపై కంటతడి పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.ప్రజల కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు… … Read more

    2022 ఓవరాల్ ఆంధ్రప్రదేశ్‌ రౌండప్‌

    కొత్త జిల్లాల ఏర్పాటు. వాటి పేర్లపై రచ్చ.  హైకోర్టులో నూతన జడ్జీల ప్రమాణం. మూడు రాజధానులపై రగడ. ఆశావాహులు, అసంతృప్తుల మధ్యే కొలువుదీరిన కొత్త మంత్రివర్గం. అల్లూరి జిల్లాలో 30 అడుగుల విగ్రహం.  అదే సందిగ్ధతలో పోలవరం. టీడీపీ, వైకాపా మధ్య పెరుగుతున్న అంతరం. మధ్యలో జనసేనాని పవన్ కల్యాణ్‌ వైరం. సంక్షేమానికి అప్పులు. మాదక ద్రవ్యాల సరఫరా కట్టడిలో విఫలం. ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు, సమస్యలు, పోరాటాలు మధ్య ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం సాగింది. కొత్త జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ … Read more