• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాళ్లు సర్వేల్లో గెలిస్తే.. మేం ఎన్నికల్లో గెలుస్తాం: కవిత

    బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తానని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం ఎలక్షన్‌ స్టంట్‌ అని ఆరోపించారు. బీజేపీతో తమకు ఎలాంటి డీల్‌ లేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కచ్చితంగా 95-105 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల్లో కాంగ్రెస్ గెలిస్తే.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్నారు. ఓబీసీల కుల గణన చేయడాన్ని కేంద్రం నిరాకరిస్తోందిని మండిపడ్డారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్‌ ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదని కవిత పేర్కొన్నారు.

    రాహుల్ షేర్ కాదు పేపర్ పులి: కవిత

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాహుల్ బబ్బర్ షేర్ కాదని.. పేపర్ పులి మాత్రమే అని విమర్శించారు. జగిత్యాలలో కవిత మాట్లాడుతూ.. ‘గాంధీ కుటుంబానికి తెలంగాణకు విద్రోహక సంబంధం ఉంది. సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేసి పోరాడితే తెలంగాణ వచ్చింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సింగరేణి కార్మికులకు న్యాయం జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసు మరచి దిగజారి మాట్లాడుతున్నారు. గల్ఫోలో ఉన్న వారి పేర్లు రేషన్ కార్డుల నుంచి ఎట్టి పరిస్థితిలోను తొలగించం’ అని కవిత … Read more

    కాంగ్రెస్ బీజేపీ పోటీనే కాదు: కవిత

    ఎమ్మెల్సీ కవిత బీజేపీ, కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆర్ఎస్‌కు పోటీనే కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న పథకాలు పరిశీలిస్తే.. అవన్నీ బీఆర్ఎస్ పథకాలే. తెలంగాణ ప్రజలు తెలివైనవారు. బీజేపీ, కాంగ్రెస్ మాయమాటలను విశ్వసించరు. ఎన్నికల్లో గెలిచేది బీఆర్‌ఎస్‌నే. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా కేసీఆర్ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.

    లండన్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లండన్ పర్యటనకు వెళ్లారు. ఆమె శుక్రవారం బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్‌లో ‘మహిళా రిజర్వేషన్ చట్టం- ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వనున్నారు. శనివారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్, అటుమ్ని సమావేశంలో కవిత పాల్గొంటారు.

    రేవంత్‌ని తరిమి కొట్టాలి: కవిత

    TS: రైతులకు 3 గంటల పాటు కరెంట్ ఇవ్వాలనే రేవంత్‌ని ఊరి పొలిమేర దాకా తరిమి కొట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు సారీ చెప్పేదాకా వారిని గ్రామాల్లో తిరగనీయొద్దని పిలుపునిచ్చారు. విద్యుత్ సౌధ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో పాల్గొని కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదన్న రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఈ నిరసన చేపట్టింది. #WATCH | BRS MLC … Read more

    కవిత కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈడీ

    ఎమ్మెల్సీ కవిత కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని ధర్మాసనాన్ని కోరారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వరాదని అభ్యర్థించారు. కాగా ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కాగా అంతకుముందే ఈ నెల 20న మరోమారు ఈడీ విచారణకు కవిత హాజరుకానుంది.