అన్‌స్టాపబుల్ షోలో పాల్గొనను: రోజా
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు వెళ్లే ప్రసక్తే లేదని వైసీపీ నేత ఆర్కే రోజా స్పష్టం చేశారు. గతంలో రెండు సార్లు పిలిచినపుడు కుదరలేదని..కానీ ఇప్పుడు కుదిరినా వెళ్లబోనని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ల ఎపిసోడ్ల తర్వాత అన్స్టాపబుల్కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే అన్‌స్టాపబుల్ ప్రస్తుతం టాప్ టాక్‌షోగా నడుస్తోంది.