• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యాషెస్ సిరీస్.. కలుసుకున్న ప్రధానులు

    టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ‘యాషెస్’ సిరీస్ వేరు. ఇటీవల యాషెస్‌లో జరిగిన వివాదంపై ఇరు దేశాల ప్రధానులు మాటల దాడి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, నిన్న వీరిద్దరూ కలిశారు. సరదాగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సిరీస్‌లో తామే లీడ్‌లో ఉన్నట్లు(2-1)ని ఆసీస్ ప్రధాని అల్బనీస్ చూపించగా, మూడో టెస్టులో విజయానందంలో ఉన్న ప్లేయర్ల ఫొటోని రిషి సునాక్ ప్రదర్శించారు. అనంతరం, బెయిర్ స్టో స్టంపింగ్‌ని చూపించి అల్బనీస్ మరింత ఉత్సాహ పరిచారు. దీంతో రిషి బిగ్గరగా నవ్వారు. Ashes … Read more

    బ్రిటన్ పీఎం రిషి సునాక్‌కు ఫైన్

    బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు లాంక్‌షైర్ పోలీసులు జరిమానా విధించారు. కారులో [సీటు బెల్టు](url) ధరించకుండా ప్రయాణించినందుకు రూ.10 వేల (100 పౌండ్లు) జరిమానా విధించారు. ప్రధాని అయ్యి ఉండి సీటు బెల్టు పెట్టుకోకుండా ఎలా ప్రయాణిస్తారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా యూకే చట్టాల ప్రకారం కారులో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా సీటు బెల్టు ధరించాలి. లేదంటే 100 పౌండ్ల ఫైన్ చెల్లించాలి. కోర్టు వరకు వెళ్తే 500 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. Does he know how awfully patronising he comes across? … Read more

    రిషి సునాక్‌ చెవిలో ఏం చెప్పారో!

    ఈజిప్టు వేదికగా జరుగుతున్న ‘కాప్‌-27’ సదస్సు నుంచి బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ అర్ధంతరంగా వెళ్లిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది చెవిలో ఏదో చెప్పగానే అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. దీంతో అసలు ఏం జరిగిందో అర్థం కాక అక్కడున్నవారు గందరగోళానికి గురయ్యారు. అసలు తొలుత సమావేశానికి హాజరుకాకూడదని భావించిన రిషి సునాక్‌, విమర్శలు రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు [వీడియో](url)లను వాతావరణ మార్పులపై నడుస్తున్న ‘కార్బన్‌ బ్రీఫ్‌’ అనే వెబ్‌సైట్ డైరెక్టర్‌ లియో హిక్‌మన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. UK … Read more

    “హాయ్ విజయ్‌ మామా” రిషి సునాక్‌ వీడియో వైరల్‌

    “హాయ్‌ విజయ్‌ మామా! ఎలా ఉన్నావ్‌?” అంటూ భారత సంతతికి చెందిన నూతన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ మాట్లాడుతున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ షెఫ్‌ సంజయ్‌ రైనా ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇంతకీ విజయ్‌ మామా ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘విజయ్‌ మాల్యా’ అయితే కాదుగా అంటూ కొందరు కామెడీ ట్వీట్లు చేస్తున్నారు. ఆ [వీడియో](url) మీరు కూడా చూడండి. Visa on arrival ab pakka ??#RishiSunak pic.twitter.com/imSIhuEgKB … Read more