• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు చంద్రగ్రహణం.. తిరుమల మూసివేత

    నేడు శారద పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై ఉండనుంది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. దీంతో నేటి రాత్రి నుంచే అన్ని దేవాలయాల తలుపులు మూతపడనున్నాయి. 8 గంటల పాటు ఇది కొనసాగుతుంది. తిరుమల ఆలయాన్ని సైతం రాత్రి 7.05 గం.లకు మూసివేయనున్నారు. తిరిగి రేపు తెల్లవారుజామున 3.15 గం.లకు తెరుస్తారు.

    28న శ్రీవారి ఆలయం మూసివేత

    AP: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 28న మూసి వేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తితిదే తెలిపింది. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు గుడి తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లు తితిదే స్పష్టం చేసింది.

    జనవరి నెల కోటా టికెట్లు విడుదల

    జనవరి నెల కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను టీటీడీ విడుదల చేసింది. టికెట్లను టీటీడీ వెబ్ సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. జనవరి నెలకు సంబంధించి నిన్న శ్రీవాణి భక్తుల దర్శనం, వసతి కోటా టికెట్లు విడుదల చేసింది. అటు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల వరకు సమయం పడుతోంది. సోమవారం స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.12 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం పడుతున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 77,187 మంది భక్తులు దర్శించుకోగా 29,209 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్లు వచ్చింది. కాగా నేటితో తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

    నేడు మోహిని అవతారంలో శ్రీవారు

    నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో కనిపించనున్నారు. ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం.. సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ.. గరుడ వాహన సేవ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ప్రతి 5 నిమిషాలకు బస్టాండ్‌లో ఓ బస్సు నడపనున్నట్లు టీటీడీ తెలిపింది.

    శ్రీవారి దర్శనానికి 4 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,785 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

    AP: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇవాళ రాత్రి 7-8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధు­ల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ ఘట్టం తరువాత రంగనాయకుల మం­డపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అక్టోబర్‌ 15–23వ తేదీల మధ్య ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు ఉ. 9-11 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ నిర్వహిస్తారు.

    రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    ఈ నెల 14 నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 19న సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారి గరుడ ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా 14వ తేదీ నుంచి 23 వరకు స్వామివారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

    తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,937 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24,101 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    శ్రీవారి దర్శనానికి 6 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న శ్రీవారిని 72,230 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 27,388 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం వెంకన్న హుండీ ఆదాయం రూ.3.74కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.