• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  •  Tata Harrier Facelift : దిమ్మతిరిగే ఫీచర్లతో టాటా నుంచి కొత్త  కారు…  XUV700, MG హెక్టార్‌కు గట్టి సవాల్

    టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్(Tata Harrier Facelift) అక్టోబర్ 17న లాంచ్ కానుంది. ఇది టాటా మోటార్స్  ఫ్లాగ్‌షిప్ కారుగా చెప్పవచ్చు. ఈసారి ఈ SUV హారియర్‌ మోడల్‌ను  పూర్తిగా నవీకరించింది. అక్టోబర్ 17న విడుదల కానున్న టాటా హారియర్ SUV పూర్తిగా రిఫ్రెష్ చేసిన కొత్త లుక్‌లో,  కొన్ని ఫంకీ-లుకింగ్ కలర్ ఆప్షన్‌లతో రానుంది. పూర్తిగా రీడైజైన్ చేసిన ఇంటీరియర్‌తో సహా అనేక అప్‌డేట్‌లు అయితే హారియర్‌లో వస్తున్నాయి. అలాగే, ఈ SUV BS6 ఫేజ్-2కు అనుగుణంగా పూర్తిగా డీజిల్ ఇంజిన్‌తో రానుంది. మరీ ఈ కారు  డిటేయిల్డ్ ఫీచర్స్, ధర ఇప్పుడు చూద్దాం.

    Tata Harrier Facelift డీజైన్

    టాటా హారియర్ ఫెస్‌లిఫ్ట్ డిజైన్‌… కొద్దివారాల క్రితం మార్కెట్‌లోకి వచ్చిన Tata Nexon facelift మాదిరి ఉంది.  అయితే దీని ముందు వెనక భాగాలు మాత్రం గతంలోని మోడల్స్ కంటే కొన్ని అప్‌డేట్స్ అయితే వచ్చాయి. ముందు భాగంలో ట్రాపెజోయిడల్ హౌసింగ్‌లో ఉంచిన హెడ్‌లైట్‌లతో కూడిన స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్‌ అమర్చబడింది. బంపర్‌ బాగంలో సీక్వెన్షియల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్‌లు (DRLలు), టాటా మోటార్స్ లోగో  స్లిమ్ అప్పర్ గ్రిల్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. బంపర్‌పై ఉన్న రేడియేటర్ గ్రిల్..  విశాలమైన ఎయిర్ ఇన్‌టేక్ స్లాట్‌లతో పెద్దదిగా మారింది.  అయితే LED టర్న్ సూచికలు సీక్వెన్షియల్ ప్యాటర్న్‌లతో వచ్చాయి. 

    ఈ సరికొత్త SUV ఫ్లోటింగ్ రూఫ్ నమూనాను కలగి ఉంటుంది. ఇది గత మోడల్స్ కంటే భిన్నంగా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై పరుగెడుతుంది. వెనుకకు కదులుతున్నప్పుడు, కొత్త LED టైల్‌లైట్‌లతో పాటు రీపొజిషన్డ్ రిఫ్లెక్టర్‌లు, రివర్స్ లైట్‌లు ఈ SUVకి మరింత అందాన్ని అయితే జోడిస్తాయి.

    న్యూ డైమెన్షన్స్..

    డైమెన్షన్స్ పరంగా చూస్తే… 4605mm పొడవు, 1922mm వెడల్పు మరియు 1718mm ఎత్తు, వీల్‌బేస్ 2751mm విస్తరించి ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 210mm వరకు ఉంది.

    సరికొత్త రంగుల్లో..

    కొత్త టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ ఏడు విభిన్న రకాల కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండనుంది. పెబుల్ గ్రే, సన్‌లైట్ ఎల్లో, సీవీడ్ గ్రీన్, యాష్ గ్రే,  కోరల్ రెడ్, ఒబెరాన్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్ ఎంపికల్లో లభిస్తుంది. వీటిలో సన్‌లైట్ ఎల్లో, పెబుల్ గ్రే, సీవీడ్ గ్రీన్ కలర్స్ ఈ టాటా SUVకి పూర్తిగా కొత్తవి.

    క్యాబిన్ డీజైన్

    టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ క్యాబిన్ డీజైన్.. టాటా నెక్సాన్‌ను ఫాలో అయింది. క్యాబిన్ లోపల 12.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.2-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది.  సరికొత్త 10-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, పవర్డ్  వెంటిలేటెడ్ డ్రైవర్,  కో-డ్రైవర్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌ వంటి హంగులు ఉన్నాయి.. హారియర్ ఫేస్‌లిఫ్ట్ ప్యాడిల్ షిఫ్టర్‌లు మరియు టెర్రైన్ మోడ్ సెలెక్టర్‌తో పాటు కొత్త చిన్న గేర్ లివర్‌ను కూడా అమర్చారు.

    ఇంజిన్ కెపాసిటీ

    హారియర్ ఫేస్‌లిఫ్ట్ 2.0-లీటర్ మోటారుతో నడిచే టర్బో డీజిల్ ఇంజిన్‌తో వస్తోంది. అయితే, ఇంజిన్ BS6 ఫేజ్ 2కి అనుగుణంగా ఉండేలా అప్‌డేట్ చేశారు. ఇది 168 bhp వద్ద 350 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ యూనిట్, సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ ఛాయిస్‌లతో అందుబాటులో ఉంది.

    భద్రతా ప్రమాణాలు

    హారియర్ ఫేస్‌లిఫ్ట్ సరైన భద్రతా ప్రమాణాలతో వస్తోంది. ఇందులో ప్రయాణించే  ప్రయాణీకులందరికీ త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌లతో సహా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. వీటికి  అదనంగా, కొత్త హారియర్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ విత్ చేంజ్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్,  అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వంటి సెఫ్టీ పంక్షన్లు అయితే ఉన్నాయి.

    మైలేజ్ (Tata Harrier Facelift Mileage) 

    గతంలో వచ్చిన హారియర్ మోడళ్ల కంటే ఇంది మెరుగైన మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 14.6 – 16.8 km/l మైలేజ్ ఇస్తుందని వెల్లడించింది.

    వీటికి గట్టి పోటీ

    మిడ్ రేంజ్ SUV సెగ్మెంట్లో టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్… మహీంద్రా XUV700, MG హెక్టార్, జీప్ కంపాస్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

    ధర

    టాటా హారియర్ వేరియంట్‌ను బట్టి రూ.15లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు కారు ధర ఉండనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv