ఇండస్ట్రీ వ్యక్తులంటే సాధారణంగా జనాలకు కొంచెం ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వాళ్ళ నుంచి ఎలాంటి వార్త వచ్చినా, వాళ్ళ గురించి ఎలాంటి గాసిప్ వచ్చినా అదేంటా అని తెలుసుకునే పనిలో పడిపోతారు. అందుకే సినిమా వాళ్ళు ఏం షేర్ చేసిన అది వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. అయితే పలు తెలుగు సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ తేజస్వి మావిడాల ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. తన అందంతో, ఆట ఆడే స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు బిగ్‌బాస్ ద్వారా మరింత దగ్గరైన ఈ భామ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సినిమా వాళ్ళు సాధారణంగానే డ్యాన్సులు బాగా చేస్తారు. అందులోనూ హీరో హీరోయిన్లు అంటే ఆ మాత్రం డాన్స్ కంపల్సరీ మరి. అందుకే వాళ్ళు చేసే డ్యాన్సులు చాలా చూడముచ్చటగా ఉంటాయి. తాజాగా తేజస్వి కూడా చేసిన ఓ డ్యాన్స్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. తమిళ పాటకు తేజస్వి మ్యాడ్ నింజా మహితో కలిసి వేసిన స్టెప్పులు చూడముచ్చటగా ఉన్నాయి. దానికి పాట లిరిక్స్ ని కాప్షన్‌గా జోడిస్తూ.. పోస్ట్ చేసింది. దీంతో ఆ డ్యాన్స్ రీల్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.