తెలుగులో గతవారం థియేటర్/ ఓటీటీలో అనేక సినిమాలు విడుదలై సందడి చేశాయి. అందులో చాలా వరకూ డిజాస్టర్ టాక్‌తో నిలిచాయి. ఈ వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అవేంటో చూద్దాం.
థియేటర్ రిలీజ్‌లు
కృష్ణ వ్రింద విహారి
నాగశౌర్య, షెర్లీ జంటగా అనీశ్ ఆర్. దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ కృష్ణ వ్రింద విహారి’. వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ నెల 23న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం చిత్రబృందం బాగానే కష్టపడుతోంది. వర్షంలోనూ పాదయాత్ర చేస్తూ హీరో నాగశౌర్య సినిమా ప్రచార బాధ్యతలను మోస్తున్నాడు. నాగశౌర్య గత చిత్రం ‘లక్ష్య’ విఫలం కావడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.
అల్లూరి
శ్రీ విష్ణు హీరోగా వస్తున్న పోలీస్ యాక్షన్ సినిమా ‘అల్లూరి’. ఈ సినిమా కోసం కూడా భారీగానే ప్రచారం చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అల్లు అర్జున్ అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా.. హర్షవర్ధన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ‘అల్లూరి’ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించబోతోంది.
దొంగలున్నారు జాగ్రత్త
విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న కీరవాణి తనయుడు సింహా మరోసారి ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌తోమన ముందుకు వస్తున్నాడు. ‘దొంగలున్నారు జాగ్రత్త’ అంటూ ఈ నెల 23న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. సముద్రఖని, ప్రీతి అస్రాని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సతీశ్ త్రిపుర దర్శకత్వం వహించగా.. సింహా సోదరుడు కాలభైరవ సంగీత స్వరాలు అందించారు.
మాతృదేవోభవ
మాతృత్వంలోని గొప్పదనాన్ని చాటేలా మరో కె.హరనాథ్ రెడ్డి తెరకెక్కించిన ‘మాతృదేవోభవ’ ఈ నెల 24న విడుదల కానుంది. చమ్మక్ చంద్ర, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్లలో విడుదల కాబోతోంది.
పగ పగ పగ
ప్రముఖ దర్శకుడు కోటి విలక్షణ పాత్రలో కనిపిస్తున్న సినిమా పగ పగ పగ. ఫన్నీగా సాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ రవి దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహించారు.ఈనెల 22న విడుదల కాబోతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షోను ప్రేక్షకులకు ఉచితంగా చూపిస్తామని చిత్రబృందం ప్రకటించింది.
ఓటీటీ రిలీజ్‌లు
బబ్లీ బౌన్సర్
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన బబ్లీ బౌన్సర్ ఈ నెల 23న హాట్‌స్టార్‌లో విడుదల కాబోతోంది. పబ్‌లో లేడీ బౌన్సర్‌గా ఉద్యోగం చేసే ఒక అమ్మాయి కథగా ఈ సినిమా తెరకెక్కింది. తమన్నా మొదటిసారిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుండటంతో దీనిపై ఆసక్తి పెరిగింది.
ఫస్ట్ డే ఫస్ట్ షో
జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ కథ,కథనం అందించిన చిత్రం ‘ ఫస్ట్ డే ఫస్ట్ షో’. వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహించారు. రాధన్ స్వరాలు సమకూర్చాడు. పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా అక్కడక్కడా నవ్వించినా థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 23న ఆహాలో విడుదల కాబోతోంది.
Celebrities Featured Articles Telugu Movies
Fahadh Faasil: ‘పుష్ప 2’ ఈవెంట్స్‌ను ఫహాద్ ఫాజిల్ అందుకే పక్కకు పెట్టాడా?