[VIDEO](url): మహారాష్ట్ర పుణెలో 10 ఏళ్ల బాలిక చైన్ స్నాచర్‌ను అడ్డుకుంది. తన నానమ్మ మెడలో గొలుసును దొంగిలించడకుండా నిలువరించింది. బైక్‌పై వచ్చిన చైన్ స్నాచర్ వృద్దురాలి మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించాడు. వృద్ధులు కేకలు వేయడంతో పక్కనే ఉన్న మనవరాలు అడ్డుకుంది. తన చేతిలోని సంచితో దొంగోడి తలపై దాడి చేసింది. అదే పనిగా కొట్టడంతో నిందితుడు గొలుసు వదిలేసి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.