• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సామ్‌ కర్రాన్ ఊచకోత

    ఇంగ్లాండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో ఇంగ్లీష్‌ ఆల్‌ రౌండర్‌ సామ్‌ కర్రాన్‌ విధ్వంసం సృష్టించాడు. సర్రే క్లికెట్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్‌.. గ్లామోర్గాన్‌ జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. 18 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న సామ్‌.. 59 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సర్రే జట్టు 238 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లామోర్గాన్‌ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv