అన్నాచెల్లెళ్ల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. తన చెల్లిని అన్నయ్య ఎంతో అపురూపంగా చూసుకుంటాడనడానికి ఈ వీడియో నిదర్శనం. ఓ బాలుడు తన సోదరిని సైకిల్‌పై ఎక్కించుకుని వెళ్తుండగా దారిమధ్యలో ఆపాడు. సైకిల్‌పై నుంచి కింద పడకుండా, చిన్నారి కాళ్లు చక్రంలో ఇరుక్కుపోకుండా ఓ బట్టతో సైకిల్ గొట్టానికి ఆసరగా కట్టాడు. ఇలా కడుతున్నంత సేపు ఆ చిన్నారి అన్నయ్యకు సహకరించడం చూసి నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. ‘ఎంతో అపురూపం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్విటర్‌లో ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
-
Screengrab Twitter:@urdunovels
-
Screengrab Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్