• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 7 నుంచి 13వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.

    థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు

    జైలర్‌

    రజనీకాంత్ కాంత్‌ లేటెస్ట్‌ మూవీ జైలర్‌ ఈ వారమే థియేటర్లలో రిలీజ్‌ కానుంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 10న (గురువారం) ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో తమన్నా కథానాయికగా చేసింది. మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. జైలర్‌లో రజనీకాంత్‌ స్టైల్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చూస్తుంటే పాత రజనీని గుర్తు చేస్తున్నాయి. అనిరుధ్‌ రవిచంద్రన్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రచార చిత్రాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్‌ చేసింది.

    భోళాశంకర్‌ 

    వాల్తేరు వీరయ్యగా ఈ ఏడాది వినోదాలు పంచిన మెగాస్టార్‌ చిరంజీవి.. ‘భోళా శంకర్‌’గా మరోమారు సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులోనూ తమన్నానే హీరోయిన్‌గా చేసింది. కీర్తి సురేష్‌ చిరు చెల్లెలిగా నటించింది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబైన ఈ చిత్రంలో చిరు స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు. 

    ఓ మై గాడ్‌

    అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్‌’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) రూపొందిన సంగతి తెలిసిందే. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఉస్తాద్‌

    శ్రీసింహా హీరోగా ఫణిదీప్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్‌’. బలగం ఫేమ్‌ కావ్యా కల్యాణ్‌రామ్‌ హీరోయిన్‌గా చేసింది. గౌతమ్‌ మేనన్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12న (శనివారం) ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీసింహా మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. జోసెఫ్‌ డిసౌజా అనే పైలట్‌ పాత్రలో గౌతమ్‌ మేనన్‌ నటించారు. 

    గదర్‌ 2

    ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవోల్‌ హీరోగా చేసిన ‘గదర్‌ 2’ చిత్రం కూడా ఈ వారమే రిలీజ్‌ కానుంది. ఆగస్టు 11 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సన్నీ దేవోల్‌.. తారా సింగ్‌ పాత్రలో నటించారు. సకీనాగా అమీషా పటేల్‌ నటించింది. ఈ చిత్రానికి అనిల్‌ శర్మ దర్శకత్వం వహించారు. చరణ్‌జీత్‌గా ఉత్కర్ష్‌ శర్మ కనిపించనున్నారు. జీ స్టూడియోస్‌తో అనిల్‌ శర్మ, కమల్‌ ముకుట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే!

    హిడింబ

    ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ బాబు హీరోగా చేసిన రీసెంట్‌ చిత్రం హిడింబ. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఆహా వేదికగా ఆగస్టు 10 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అనీల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీవిఘ్నేష్‌ సినిమాస్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించాడు. అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత నటించింది.

    TitleCategoryLanguagePlatformRelease Date
    Gabby’s DollhouseWeb SeriesEnglishNetflixAugust 7
    ZombieverseWeb SeriesEnglishNetflixAugust 8
    Heart of StoneMovieHindiNetflixAugust 11
    In another world with my smartphoneMovieEnglishNetflixAugust 11
    Pending TrainMovieEnglishNetflixAugust 11
    The kashmir files unreportedDocument SeriesHindiZee 5August 11
    Abar ProloySeriesBengaliZee 5August 11
    The Jengaburu CurseSeriesHindiSonyLIVAugust 9
    Por ThozhilSeriesTelugu/TamilSonyLIVAugust 11
    Made in HeavenSeriesEnglishAmazon primeAugust 10

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv