• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ తప్పు మళ్లీ జరగకూడదు: సినీ నిర్మాత

    ఎజెంట్, భోళా శంకర్ చిత్రాల నిర్మాత అనీల్ సుంకర ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇటీవల ఆయన నిర్మించిన చిత్రం ఊరు పేరు భైరవకోన మూవీ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇస్తు ట్వీట్ చేశారు. ‘మేం ఖరీదైన తప్పులు చేశాం అందుకే ఎజెంట్, భోళా శంకర్ ఫ్లాప్‌లుగా నిలిచాయి. మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదని ప్రయత్నిస్తున్నాం. అలానే సినిమాను వీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ క్వాలిటీ కోసం ప్రయత్నిస్తున్నాం. వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి కాగానే ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’. అని అనిల్ సుంకర … Read more

    ‘భోళాశంకర్’ థర్డ్ సింగిల్ వచ్చేసింది

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళాశంకర్’ మూవీ నుంచి థర్డ్ సింగిల్ విడుదలైంది. ‘మిల్కీ బ్యూటీ’ అంటూ సాగే పాటను మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను విజయ్ ప్రకాశ్, సంజన, మహతిస్వరసాగర్‌లు పాడారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ మూవీలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. మెహెర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కీర్తిసురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    ‘భోళాశంకర్’ నుంచి ‘జజ్జనక’ సాంగ్

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళాశంకర్’ మూవీ నుంచి ఓ పాట రిలీజైంది. ‘జాం జాం జజ్జనక’ అంటూ సాగే సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో మెగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాశర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. కాగా ఈ మూవీలో చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. మెహెర్ రమేశ్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర నిర్మించారు. ఆగష్టు 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

    భోళా శంకర్‌ నుంచి ప్రోమో రిలీజ్‌

    చిరంజీవి ‘భోళా శంకర్‌’ సినిమా నుంచి ‘జామ్‌ జామ్‌ జజ్జనక’ పాట ప్రోమో విడుదలైంది. పూర్తి లిరికల్‌ సాంగ్‌ను జులై 11న సాయంత్రం 4:05 గం.లకు రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలియజేశారు. చిరు, సుశాంత్‌, తమన్నా, కీర్తి ఈ ప్రోమోలో స్టెప్పులేస్తూ కనిపించారు. మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఇందులో చిరుకు జంటగా తమన్నా నటిస్తుండగా చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్‌ కనిపించనుంది.

    BHOLASHANKAR: షికారుకు వచ్చిన షేర్!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘భోళాశంకర్’ మూవీ టీజర్ విడుదలైంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య 70ఎంఎంలో టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో ‘షికారుకు వచ్చిన షేర్‌ను బే’ అంటూ చిరు మాస్ డైలాగ్స్ పలికాడు. యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కాగా ఈ సినిమాలో చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. మొహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఆగష్టు 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    CHIRU LEAKS: ‘భోళాశంకర్’ నుంచి మరో సాంగ్ లీక్!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. కాగా సినిమాలోని ఓ సంగీత్ సాంగ్‌ను చిరంజీవి లీక్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఎవరికీ చెప్పకుండా.. మీరొక్కరే చూడాలని రాసుకొచ్చాడు. ఈ పాటలో తమన్నా, కీర్తిసురేష్, సుశాంత్, వెన్నెల కిశోర్, హైపర్ ఆది తదితరులు కనిపిస్తున్నారు. ఈ పాటలో ప్రతిఒక్కరూ చిందేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. https://www.instagram.com/reel/CtOkJ3CpCAf/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

    ‘భోళా శంకర్‌’ సెట్‌కు చిరుకు గ్రాండ్‌ వెల్‌కమ్‌

    [VIDEO](url): ‘వాల్తేరు వీరయ్య’ సూపర్‌ హిట్ జోరులో ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి.. అదే ఉత్సాహంతో ‘భోళా శంకర్‌’ షూటింగ్‌ మొదలుపెట్టారు. తమిళ సినిమా వేదాలం రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ ప్రారంభించారు. షూటింగ్‌ స్పాట్‌లో చిరుకు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందులో చిరు సరసన తమన్నా నటిస్తోంది. కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా..మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. A MASSive … Read more

    రాఖీ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తన తర్వాతి చిత్రం ‘భోళా శంకర్’ ద్వారా చిన్న వీడియోతో చిరు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో చిరు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ‘అక్కా చెల్లెల్లందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు ప్రేమతో మీ సోదరుడు చిరంజీవి’ అంటూ ఆయన మాటల్లో చెప్పారు. భోళా శంకర్ సినిమాను మెహెర్ రమేశ్ తెరకెక్కిస్తుండగా, AK ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.