దసరా సందర్భంగా థియేటర్లలో నెలకొన్న చిత్రాల హంగామా దీపావళికి కూడా కొనసాగనుంది. ఈసారి దీపావళి సందర్భంగా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
టైగర్ 3
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టైగర్3 ’ (Tiger 3) దీపావళి కానుకగా రాబోతోంది. నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ (Katrina Kaif) నటించింది. ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్‌లు అదరహో అనేలా ఉన్నాయి.
జపాన్
కథనాయకుడు కార్తి (Karthi) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మరుగున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో కార్తి ‘జపాన్’ అనే దొంగ పాత్రలో కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలు జపాన్ ఎలా దొంగిలించాడు? అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ఎత్తుగడలు ఏంటి? వంటి ఆసక్తికర అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జిగర్ తండా డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ (Jigarthanda DoubleX). ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్ ఆధారంగా సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు ఆ గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సివస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిగర్ తండ’. ఇప్పుడు ఆ కథకే మరింత యాక్షన్‌ను జోడించి తెరపైకి ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
అలా నిన్ను చేరి
దినేశ్ తేజ్ హీరోగా హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయిసుధాకర్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమ, కుటుంబ వినోదంతో కూడిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయని పేర్కొంది.
ది మార్వెల్స్
అమెరికన్ సూపర్ హీరో సినిమా ‘ది మార్వెల్స్’ (The Marvels) కూడా ఈ వారమే థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటి బ్రీ లార్సన్ కెప్టెన్ మార్వెల్ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇమాన్ వెల్లని, టోయోనా ప్యారిస్, సియో-జున్ పార్క్, శామ్యూల్ ఎల్. జాకన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
దీపావళి
అందమైన పల్లెటూరి కథతో ‘దీపావళి’ సినిమా రూపొందింది. రాము, వెంకట్, దీపన్ ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ దర్శకత్వం వహిచారు. పండగకు కొత్త డ్రెస్ కావాలని అడిగిన మనవడి కోసం తాత తన మేకను బేరం పెడతాడు. ఆ మేక చుట్టూ అల్లుకున్న ఓ అహ్లాదకరమైన కథే ఈ సినిమా. దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Title | Category | Language | Platform | Release Date |
Rainbow rishta | Series | English | Amazon Prime | Nov 07 |
BTS: Yet To Come | Movie | English | Amazon Prime | Nov 09 |
Pippa | Movie | Hindi | Amazon Prime | Nov 10 |
Irugapatru | Movie | Tamil | Netflix | Nov 06 |
Escaping twin flames | Series | English | Netflix | Nov 08 |
The killer | Movie | English | Netflix | Nov 10 |
The Road | Movie | Tamil | Aha | Nov 10 |
The Santa Clause 2 | Series | English | Disney+Hotstar | Nov 08 |
Label | Series | Telugu | Disney+Hotstar | Nov 10 |
Ghoomer | Movie | Hindi | Zee 5 | Nov 10 |
……………………………………………………………………………………………………………….
APP: దీపావళి సందర్భంగా సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవంబర్ 6 నుంచి 12వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఏవో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?