సంక్రాంతి తర్వాత మరోసారి సినీ ప్రేక్షకులను పలకరించడానికి ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా వస్తున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
ఫైటర్
హృతిక్ రోషన్ (Hrithik Roshan), దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఫైటర్’ (Fighter). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇందులో యుద్ధ విమాన పైలట్‌గా హృతిక్ కనిపించనున్నాడు. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జనవరి 25న థియేటర్స్‌లో విడుదల కానుంది.
మలైకోటై వాలిబన్
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్.. ‘మలైకోటై వాలిబన్’ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లిజో జోస్ పెలిసెరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఓటమెరుగని రెజ్లర్ వాలిబన్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కెప్టెన్ మిల్లర్
ధనుష్ (Dhanush) కథానాయకుడిగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ప్రియాంక మోహన్ కథానాయిక. సందీప్‌కిషన్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జనవరి 25 నుంచి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
అయలాన్
శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘అయలాన్’ (Ayalaan) చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమాను జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్‌గా చేసింది. శివ కార్తికేయన్ నటన, కామెడీ, గ్రహాంతరవాసి హంగామా తమిళ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి తెలుగులోనూ ఈ సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
105 మినిట్స్
ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘105 మినిట్స్’. ప్రముఖ కథానాయిక హన్సిక (Hansika) ప్రధాన పాత్ర పోషించగా… రాజు దుస్సా దర్శకత్వం వహించారు. బొమ్మక్ శివ నిర్మించారు. జనవరి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఈ వారం ఓటీటీలో విడుదయ్యే చిత్రాలు
యానిమల్
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ (Animal) చిత్రం.. ఈ వారమే ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో కంటే 8 నిమిషాల ఎక్కువ నిడివి (3 గం.ల 29 ని.)తో ప్రసారం కానుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. యానిమల్ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.900 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
Queer Eye | Series | English | Netflix | Jan 24 |
Six Nations | Series | English | Netflix | Jan 24 |
Animal | Movie | Telugu/Hindi | Netflix | Jan 26 |
Bad Land Hunters | Movie | Korean/English | Netflix | Jan 26 |
Hustlers | Movie | Hindi | Amazon Prime | Jan 24 |
Panchayat | Series | Hindi | Amazon Prime | Jan 26 |
Sam Bahadur | Movie | Hindi | Zee5 | Jan 26 |
Neru | Movie | Telugu/Malayalam | Disney+HotStar | Jan 23 |
Karma calling | Movie | Hindi | Disney+HotStar | Jan 26 |
Flex X Cop | Series | English/Korean | Disney+HotStar | Jan 26 |
Fight Club | Movie | Tamil | Disney+HotStar | Jan 27 |
Shark Tank India | Series | Hindi | SonyLIV | Jan 22 |
Wonka | Movie | English | Book My Show | Jan 22 |
Aqaman 2 | Movie | English | Book My Show | Jan 23 |
Fear | Movie | English | Book My Show | Jan 23 |
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్