గత వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. డిసెంబర్ 4 నుంచి 10వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
హాయ్ నాన్న
నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’ (Hi Nanna). ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందింది. ఇందులో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చేసింది. శ్రుతిహాసన్ (Shruti Haasan), బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 2 గంటల 5 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబరు 7న విడుదల కానుంది.
ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్
హీరో నితిన్ (Nithiin) కొత్త మూవీ ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్’ (Extra: OrdinaryMan) ఈ వారమే రిలీజ్ కాబోతోంది. ఇందులో వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. ప్రముఖ హీరో రాజశేఖర్ (Rajasekhar) కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. సినిమాను చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చండిక
వీరు, శ్రీహర్ష, కుషి చౌహన్, నిషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చండిక’ (Chandika). హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. తోట కృష్ణ దర్శకత్వం వహించారు. కె.వి.పాపారావు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 8న విడుదల కానుంది.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
ఇక ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే 32కు పైగా చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం.
Title | Category | Language | Platform | Release Date |
Jigarthanda DoubleX | Movie | Telugu/Tamil | Netflix | Dec 8 |
Japan | Movie | Telugu/Tamil | Netflix | Dec 11 |
The archies | Movie | Hindi | Netflix | Dec 7 |
Leave the World Behind | Movie | English | Netflix | Dec 8 |
Dhak Dhak | Movie | Hindi | Netflix | Dec 8 |
Vadhuvu | Web Series | Telugu | Disney+Hotstar | Dec 8 |
Mast Mein Rehne Ka | Movie | Hindi | Amazon Prime | Dec 8 |
Kadak Singh | Movie | Hindi | Zee 5 | Dec 8 |
Koose Muniswamy Veerappan | Documentary | Telugu | Zee 5 | Dec 8 |
Chamak | Web Series | Hindi | SonyLIV | Dec 7 |
Maa oori polimera 2 | Movie | Telugu | Aha | Dec 8 |
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్